ప్రముఖ నిర్మాత శివ ప్రసాద్ గారు కన్నుమూత.!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన శివప్రసాద్ గారు ఇక లేరు,గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఇటీవ‌లే ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీ జ‌రిగింది. కామాక్షి మూవీస్ అధినేత డి.శివప్ర‌సాద్ రెడ్డి గారు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో శనివారం ఉద‌యం ఆరున్న‌ర గంట‌ల‌కు క‌న్నుమూశారు. 1985లో కామాక్షి మూవీస్ బ్యాన‌ర్‌ను స్థాపించి విక్కీ దాదా, ఎదురులేని మ‌నిషి, నేనున్నాను, బాస్‌, కింగ్, కేడీ, ర‌గ‌డ‌, ద‌డ,ముఠా మేస్త్రి, అల్ల‌రి అల్లుడు, ఆటోడ్రైవ‌ర్‌, సీతారామ‌రాజు, గ్రీకువీరుడు సినిమాల‌ను నిర్మించారు.అక్కినేని ఫామిలీ తో శివ ప్రసాద్ గారికి ప్రత్యేక అనుబంధం ఉంది,నాగార్జున గారితోనే అత్యధిక శాతం సినిమాలు నిర్మించారు ఆయన. ఎదురులేని మనిషి, నేనున్నాను,సీతారామరాజు వంటి పలు హిట్ సినిమాల్తో పాటు బాస్, గ్రీకువీరుడు, రగడ మూవీ లకి నిర్మాతగా వ్యవహరించారు,అక్కినేని నాగ చైతన్య దడ మూవీ కి నిర్మాతగా వ్యవహరించారు.


అక్కినేని అభిమానులకి శివ ప్రసాద్ గారు అంటే ఎంతో గౌరవం, నాగార్జున గారికి ఎంతో ఆప్తుడు మరియు ప్రియమైన మిత్రుడు శివ ప్రసాద్ గారు, కామాక్షి మూవీస్ బ్యానర్ అంటే తన సొంత బ్యానర్ కంటే ఎక్కువ అని నాగార్జున గారు పలు మార్లు చెప్పారు,ఈ మాట చాలు ,నాగార్జున గారికి శివ ప్రసాద్ గారు అంటే ఎంత ఇష్టమో చెప్పడానికి, శివ ప్రసాద్ గారు ఇక లేరు అనే వార్త సినీ ప్రముఖుల్ని కలిచి వేసింది,టాలీవుడ్ చిత్ర సీమ కు ఎన్నో మంచి చిత్రాలను అందించిన గొప్ప వ్యక్తి, శివప్ర‌సాద్ రెడ్డికి ఇద్ద‌రు కుమారులు.

 

Comments

comments

Share this post

scroll to top