మా బామ్మ డాన్స్ చేసిందని “పూజా హెగ్డే” పోస్ట్ చేసింది.! కానీ కామెంట్స్ లో తిడ్తున్నారు.! ఎందుకంటే.?

రామ్ చరణ్, సమంత జంటగా తెరకెక్కిన సినిమా రంగస్థలం. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్స్ పరంగా దూసుకుపోతోంది. ఇటీవలే సెన్సార్ కూడా పూర్తి చేసుకుని రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో పూజా హెగ్డే జిగేలు రాణి అనే స్పెషల్ సాంగ్ చేసి ఆకట్టుకుంది. అయితే ఈ సాంగ్‌కు సంబంధించి పూజ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్‌ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.


పూజావాళ్ల అమ్మమ్మ అనారోగ్యంతో రెండు రోజులుగా హాస్పిటల్‌లో ఉందట. తను వెళ్లి తన సాంగ్ ప్రోమోను చూపించే సరికి తన అమ్మమ్మ లేచి డ్యాన్స్ చేసిందంటూ ఆ వీడియోతో ట్వీట్ చేసింది పూజ. ‘‘మా అమ్మమ్మ రెండు రోజులుగా హాస్పిటల్‌లోనే ఉంది. నా జిగేలురాణి ప్రోమో చూసిన వెంటనే తనకు చాలా సంతోషం వేసి డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. అది ఆమెకు చాలా ఎనర్జీనిచ్చింది. 83ఏళ్ల యంగ్.. డీఎస్పీ మ్యూజిక్ విని తను పాడకుండా ఉండలేకపోయింది’’ అంటూ పూజ ట్వీట్ చేసింది. దీనికి ‘సో స్వీట్!! ఆమె నిజంగా 83 ఏళ్ల యంగ్’ అంటూ రకుల్ ట్వీట్ చేసింది. ఇలా అమ్మమ్మ బెడ్‌పై ఉంటే దాన్ని సినిమా ప్రమోషన్ కోసం వాడుకోవడమేంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top