టీ డబ్బులు కూడా లేని దీనావస్థలో ఒకప్పటి హీరోయిన్..! అసలేమైందో తెలుసా..?

దీపం ఉండగానే  ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత సినిమా వాళ్లకు ఖచ్చితంగా సరిపోతుంది. అవకాశాలున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి.లేదంటే పడరాని పాట్లు పడాల్సొస్తుంది.ఇప్పటివరకు చాలామంది నటీనటులను చూసాం అవకాశాలను సద్వినియోగం చేసుకుని సంపాదించుకోలేకపోవడమో,వ్యసనాలకు బానిసలవడంతోనో ఆఖరి నిమిషాల్లో అనేక ఇబ్బందులు పడినవారు ఎందరో ఉన్నారు.వారిలోకి బాలివుడ్ నటి చేరారు.ఆవిడే పూజా దద్వాల్..

వీర్‌గతి…సినిమాలో హీరోయిన్ గా నటించిన పూజా దద్వాల్ పరిస్థితి ప్రస్తుతం చాలా దీనపరిస్థితుల్లో ఉంది…1995లో సల్మాన్‌ ఖాన్‌ బ్లాక్ బాస్టర్‌ వీర్‌గతి సినిమాలో నటించి మెప్పించింది పూజ. ఆ తర్వాత వచ్చిన హిందుస్తాన్‌, సింధూర్‌ సౌగంథ్‌ సినిమాల్లోనూ నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది.ప్రస్తుతం పూజ దగ్గర  టీ తాగటానికి కూడా డబ్బులు లేని పరిస్థితి.. అనారోగ్యంతో ఆస్పత్రిలో పడి ఉంది. భర్త, కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోకపోవటంతో అలనాటి హీరోయిన్ ఇప్పుడు చివరి రోజుల్లో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. పరిస్థితులే కాదు అనారోగ్యమూ ఆమె పాలిట శాపంగా మారింది. టీబీ రోగంతో బతుకు భారంగా మారింది. సరైన తిండి లేక, మందులు కొనడానికి కూడా డబ్బులు లేక ఇతరులపై ఆధారపడుతుంది.

ప్రస్తుతం ముంబైలోని శివ్‌ది హాస్సిటల్‌లో చికిత్స పొందుతోంది. ఆస్పత్రిలో ఆమెను గుర్తించిన మీడియాకు తన గోడుని వెళ్లబోసుకుంది. ఆరు నెలల క్రితం టీబీ వచ్చింది..భర్త,కుటుంబ సభ్యులు 15 రోజుల క్రితం ఆస్పత్రిలో చేర్చి వెళ్లిపోయారు. చేతిలో చిల్లిగవ్వ లేదు..టీ తాగటానికి ఇతరులపై ఆధారపడాల్సి వస్తుందని ఏడూస్తూ చెప్పుకొచ్చింది. ఉన్న ఆస్తినంతా కుటుంబ సభ్యులు తీసేసుకున్నారని.. వైద్య ఖర్చులు భరించటానికి కూడా నా దగ్గర డబ్బులు లేవని చెబుతోంది. హీరో సల్మాన్ ఖాన్ సాయం కోసం ఎదురుచూస్తున్నానని.. మీడియా ద్వారా అయినా నా దీనస్థితి తెలుసుకుని సాయం చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పింది. ఒకప్పుడు చుట్టూ అభిమానుల హడావిడి, సందడితో జీవితం సాగేదని.. ఆ వెలుగు అంతా వెండితెరతోనే అయిపోయిందని చెబుతోంది పూజాదద్వార్..ఇప్పుడు తలచుకుంటేనే ఎందుకు బతికి ఉన్నానా అని అనిపిస్తుందని కన్నీళ్లతో చెప్పింది.

Comments

comments

Share this post

scroll to top