బాహుబలి ఫీవర్ ను పొలిటికల్ ఫీల్డ్ కు లింక్ చేశారు . చాలా క్రియేటివ్ గా కెసిఆర్, బాబుల మధ్య డైలాగ్స్ తో ప్రేక్షకులకు ఫన్ ను పంచారు ఎవరికి వారు బాహుబలి అనుకుంటున్న కెసిఆర్ ,చంద్రబాబులు ప్రజా సమస్యలపై దృష్టి పెడితే ప్రజలే చెబుతారు బాహుబలి ఎవరో, భల్లాల దేవుడెవరో అంటూ చివర్లో చక్కని మెసేజ్ తో స్పూఫ్ ను ఎండ్ చేశారు. బాహుబలి మీద చాలా స్పూఫ్స్ వచ్చాయి. బాహుబలి వాళ్లు చేస్తే, వీళ్లు చేస్తే, ఇంత బడ్జెట్ లో చేస్తే , అంత బడ్జెట్ లో చేస్తే అంటూ కానీ పొలిటికల్ పరంగా వచ్చిన ఫస్ట్ స్పూఫ్ మాత్రం ఇదే.
ఎవడంట… ఎవడంట.. నిన్ను ఎత్తుకుంది అనే సాంగ్ తో కెసిఆర్ ఎంట్రీ…. బుద్ది బలంగా ఉంటే బాహువుల్లోకి బలం అదే వస్తది అనే కెసిఆర్ డైలాగ్ నవ్వు తెప్పించాయ్. ఇక శివగామి గా సోనియాను, బిజ్జల దేవుడిగా దిగ్విజయ్ సింగ్ ను ఫోటో లో చూపిస్తూ మరింత ఫన్ ను యాడ్ చేశారు ఈ కార్టూన్ బాహుబలి స్పూఫ్లో .
CLICK: చైనా లో బాహుబలి :
ఇది కేవలం స్పూప్ మాత్రమే.. దయచేసి దీనిని ఫన్ గా మాత్రమే చూడండి. స్పూఫ్ అయినప్పటికీ మంచి మెసేజ్ ఇచ్చిన ABN ఛానల్ వారికి ధన్యవాదాలు.