అన్నాదమ్ముల బంధానికి అసలు సిసలు రూపం…IIT ని సాధించిన వీరిద్దరు.

వీరిద్దరూ అన్నాదమ్ములు…పెద్దోడి పేరు కృష్ణ, చిన్నోడి పేరు బసంత్…. పోలియో మహమ్మారి కారణంగా కృష్ణ రెండు కాళ్లు చిన్నప్పుడే చచ్చుపడిపోయాయి.కానీ కృష్ణకు చదువుకోవడమంటే అమితమైన ఇష్టం. చదువుపట్ల కృష్ణకున్న ఇష్టాన్ని చూసిన తమ్ముడు  బసంత్ నడవలేని తన అన్నను తన భుజాల మీద ఎత్తుకొని తనతో పాటే స్కూల్ కు తీసుకెళ్లేవాడు….స్కూల్ నుండి కాలేజ్ కు చేరారు ఇద్దరు. ప్రతి రోజూ అన్నను భుజాల మీద ఎత్తుకొని క్లాస్ రూమ్ లో దించడం, క్లాస్ అవ్వగానే భుజాల మీద ఎత్తుకొని మళ్లీ ఇంటి దగ్గర దించడం చేసేవాడు బసంత్ .

అంతే కాదు…ఇద్దరూ ఒకే క్లాస్ కావడంతో…ఇంటికొచ్చాక…ఇద్దరూ కలిసి కంబైన్డ్ స్టడీ చేసేవారు. ఒకరి సందేహాలను ఒకరు తీర్చుకుంటూ సబ్జెక్ట్ పట్ల మంచి గ్రిప్ ను పెంచుకున్నారు. ఇలా ఇద్దరూ చదువులో అందరికంటే ముందుండేవారు.

d3e890f4-0eea-416c-bd77-235f227b4404-750x500.jpg.pagespeed.ce.l3W0NquB4o

కట్ చేస్తే…ఇటీవల వెలువడిన IIT ఫలితాల్లో ఇద్దరూ మంచి ర్యాంక్ సాధించి, అడ్మీషన్ కొరకు వెయిట్ చేస్తున్నారు. ఇద్దరికీ మంచి కాలేజ్ లో సీటు వచ్చే అవకాశాలున్నాయి.

 

ఆస్తుల కోసం అన్నను చంపే తమ్ముడు,తమ్ముడిని అంతం చేసే అన్నలున్న ఈకాలంలో అన్న కోసం తన భుజాలను పల్లకిగా చేసిన ఈ తమ్ముడు నిజంగా నా దృష్టిలో రియల్ హీరో…అవిటితనాన్ని చూస్తూ బాధపడకుండా…ఆత్మవిశ్వాసంతో IIT ని సాధించిన అన్నకూడా హీరోనే.

అన్నాదమ్ములిద్దరూ జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని, వారి మధ్యనున్న ప్రేమ, ఆప్యాయతలు అలాగే కొనసాగాలని కోరుకుందాం.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top