శోభనాన్ని ఆపిన పోలీసులు-లేకపోతే పెళ్లకూతురికి ఎయిడ్స్ అంటుకునేది.

16 వ తేదీన పెళ్లి అయ్యింది, 18 వ తేదీన శోభనానికి ముహూర్తాలు పెట్టారు పెద్దలు. పెళ్లికొడుకు శోభనానికి రెడీ అయ్యాడు. అంతలోనే పోలీస్ వాహనం వచ్చి ఇంటి ముందు ఆగింది. వెంటనే ఈ శోభనాన్ని ఆపాలని గట్టిగా చెప్పారు పోలీసులు. పోలీసులు ఆఘమేఘాల మీద వచ్చి ఈ శోభన కార్యక్రమాన్ని ఆపి మంచి పని చేశారు. లేకపోతే ఓ యువతి జీవితం బుగ్గిపాలయ్యేది. అసలు విషయం ఏంటంటే పెళ్లికొడుక్కి ఎయిడ్స్ ఉంది. ఈ విషయాన్ని అతనికి కూడా తెలుసు అయినప్పటికీ తనకు ఎయిడ్స్ ఉందన్న విషయాన్ని దాచి పెళ్లి చేసుకోవడమే కాకుండ, శోభనానికి కూడా రెడీ అయ్యాడు ఆ ప్రబుద్దుడు.

ఓ అజ్ఞాత వ్యక్తి ద్వారా సమాచారాన్ని అందుకున్న ప.గో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ పోలీసులను వెంటపెట్టుకొని వచ్చి ఈ శోభన కార్యక్రమాన్ని ఆపి ఆ యువతిని రక్షించాడు.

fisrmmg

ఈ విషయం ఎలా బయటికొచ్చిందంటే.. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నాగళ్లదిబ్బ గ్రామానికి చెందిన ఓ యువకుడు (23) కొంతకాలం క్రితం గల్ఫ్‌ వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆసమయంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో అతడికి ఎయిడ్స్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో విదేశాలు వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. ఇది తెలిసిన మరో వ్యక్తే శోభనానికి ముందు అసలు సమాచారాన్ని అందించి ఆ యువతి జీవితాన్ని కాపాడాడు. పోలీసుల విచారణలో తాను ఎయిడ్స్‌తో బాధపడుతున్న విషయం వాస్తవమేనని అంగీకరించాడు పెళ్లి కొడుకు. దీంతో ఆ పెళ్లిని రద్దు చేయడానికి ఇరు వర్గాల పెద్దలూ అంగీకరించారు. సకాలంలో అధికారులను అప్రమతం చేసి ఒక యువతి జీవితం నాశనం కాకుండా కాపాడిన స్త్రీ శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌, పోలీసులను, సమాచారం అందించిన అజ్ఙాత వ్యక్తిని అందరం అభినందిద్దాం.

Comments

comments

Share this post

scroll to top