ఇల్లు గుల్ల కాకుండా ఉండాలంటే వినాల్సిందే..!

వినోద్  ఫ్యామిలీ తో కలిసి వాళ్ల బంధువుల ఇంట్లో పెళ్ళికి వెళ్లాడు. రెండు రోజులు ఆట ,పాట విందూ,వినోదాలతో మస్త్ ఎంజాయ్ చేశాడు. ఇక మండే డ్యూటీ కోసం బయలు దేరి ఇంటికి వచ్చాడు. తాళం తీద్దామనుకునే లోపే షాక్…..అసలు ఇంటికి వేసిన తాళమే కనిపించడం లేదు.  అతృతగా లోపలికి వెళ్లి చూశారు. బార్లా తెరుచుకున్న బీరువా తలుపులు కనిపించాయ్…. అంతే అతృతతో తాను దాచిన 5 లక్షలు ఉన్నాయా లేవా అని బీరువా అంతా వెతికాడు.. అవి కనిపించలేదు.

నిన్న రాత్రే ఆ ఇంట్లో దొంగలు దూరడం… నగలు,నట్ర,గట్రా.. దోచుకోవడం  అయిపోయాయ్.అప్పుడు వినోద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైట్ ఇచ్చాడు. ఇది చాలా మందికి ఎదురైన సంఘటనలే.

మనం ఎం చేయగలం:

  • వీలుని బట్టి సిసి కెమెరాలను అమర్చుకుందాం.
  • లిఫ్ట్ మెకానిక్, గ్యాస్ బాయ్,పోస్ట్, కొరియర్ అంటూ వచ్చే వాళ్లని ఓ కంట కనిపెడదాం.
  • డోర్ అవతల ఉన్న వ్యక్తిని  చూసే పరికరాలున్నాయ్ ,అవసరమైతే  వాటిని యూజ్ చేసుకుందాం.
  • మన ఏరియా పోలీస్ స్టేషన్ నెంబర్, S.I నెంబర్ మన ఫోన్ లో ఫీడ్ చేసుకుందాం.
  • ఊళ్లకు వెళ్లేముందు విలువైన వస్తువులను జాగ్రత్త పరిచి,పక్కింటి వాళ్లను ఇళ్లు చూసుకోమని చెప్పి వెళ్దాం.
  • మన ఏరియాలో పదేపదే అనుమానస్పదంగా ఎవరైనా సంచరిస్తుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇద్దాం.
  • పిల్లలకు బయటకి వెళ్లనివ్వకుండా చూద్దాం. అవసరమైతే తోడుగా వెళ్దాం.
  • క్రిటికల్  సిచ్యువేషన్ లో ఎలా వ్యవహరించాలో పిల్లలకు ముందుగానే నేర్పిద్దాం.

చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు..  మనం భద్రంగా ఉండొచ్చు.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top