టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా భార్య రీవా సోలంకిపై ఓ పోలీస్ కానిస్టేబుల్ దాడి చేసాడు..రీవా కారు తప్పి కానిస్టేబుల్ బైక్ ని ఢీకొట్టడంతో ఆగ్రహానికి గురైన కానిస్టేబుల్ రీవాపై దాడిచేశాడు..గుజరాత్ లోని జామ్ నగర్ లో చోటు చేసుకున్న ఈ ఘటనపై పూర్తి వివరాలు..ఇక్కడ కానిస్టేబుల్ రాంగ్ రూట్లో రావడమే కాకుండా మహిళ అని చూడకుండా దాడి చేయడం గమనార్హం..

జడేజా భార్య రీవా సోలంకి బీఎండబ్ల్యూ కారులో షాపింగ్ కి బయల్దేరారు.జామ్ నగర్లోని సరు సెక్షన్ రోడ్ కి రాగానే రాంగ్రూట్లో వస్తున్న కానిస్టేబుల్ సంజయ్ అహిర్ పల్సర్ బైక్ ని ఢీకొట్టారు.రెండు వాహనాలు ఎదురెదురుగా స్వల్పంగా ఢీకొన్నాయి.దాంతో వెంటనే ఆమె కారు దిగి దెబ్బలేమైనా తగిలాయా? అని ఆ కానిస్టేబుల్ను వాకబు చేసేలోగానే అతడు తీవ్ర ఆగ్రహంతో రీవాపై దాడికి దిగాడు. ఈ దాడిలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి.ఓ దశలో కానిస్టేబుల్ ఆమె జుట్టు పట్టుకుని కొట్టబోగా తాము రక్షించామని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

అక్కడినుండి చికిత్సకోసం ఆస్పత్రికి వెళ్లిన రీవాను జామ్నగర్ ఎస్పీ ప్రదీప్ కలుసుకుని , ఆమెను స్టేషన్కు తీసుకొచ్చి స్టేట్మెంట్ తీసుకుని ఇంటికి పంపారు.. అనంతరం పోలీసులు కానిస్టేబుల్ సంజయ్ ను అరెస్ట్ చేశారు. మహిళపై దాడి చేయడం తీవ్రమైన నేరమని, దీనిపై విచారణ జరిపి సంజయ్ అహిర్పై కఠిన చర్యలు తీసుకుంటాం జామ్నగర్ ఎస్పీ ప్రదీప్ తెలిపారు.