ఫ్యాన్స్ పై విరిగిన లాఠీలు! థియేటర్ల ముందు జై మాయూష్మతీ నినాదాలు..!

బాహుబలి ని చూడాలని  వచ్చిన ఫ్యాన్స్ వీపుల పై లాఠీల దెబ్బలు పడ్డాయి, దీంతో  కోపోద్రిక్తులైన అభిమానులు జై మాయూష్మతి అంటూ అరవడం స్టార్ట్ చేస్తూ ధియేటర్ల ముందు  కొంత గందరగోళానికి తెరతీసారు. దీంతో కంట్రోలు చేయలేకపోయిన పోలీసులు తమ లాఠీలను ఝులిపించారు. మరోవైపు టిక్కెట్ దొరికిన వారి మనోగతం ఇలా ఉంది  ” పడితే పడిది ఒక దెబ్బ టిక్కెట్టు దొరికిందా లేదా”అని.

bahubali rush

కానీ కొంత మంది అభిమానులు  పోలీసుల దాడిని అక్కడే నిరసించారు.. క్యూ లైన్లో ఉన్న వారిని కొట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.  ఇటువంటి  ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చాలా ధియేటర్ల లో కనిపించాయి బాహుబలి కారణంగా.

వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ వద్ద ఉన్న ఓ థియేటర్లో ఇటువంటి ఘటనే జరిగింది, ఇక్కడ పోలీసులు లాఠీలకు గట్టిగా పని చెప్పారు. హైద్రాబాద్ లోని తారకరామ ధియేటర్ లో తొక్కిసలాట జరిగింది.  ఇంకా చాలా చొోట్ల ధియేటర్ అద్దాలు కూడా పగిలిపోయాయి,. తోపులాటలు,  జై మాయిష్మతీ అనే నినాదాల… మధ్య  బాహుబలి ఫస్ట్ డే ముగిసింది.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top