ముగ్గురు కొడుకులు ఆమె బ‌ర్త్ డేకు రాలేక‌పోయారు. ఇది తెలిసి పోలీసులే స్వ‌యంగా ఆమె ఇంటికి వ‌చ్చి మ‌రీ బ‌ర్త్‌డేను నిర్వ‌హించారు.!

వృద్ధాప్యంలో ఉన్న త‌ల్లిదండ్రుల‌ను నేటి త‌రం పిల్ల‌లు, అందులోనూ ముఖ్యంగా మ‌గవారు ఎలా చూసుకుంటున్నారో, వారికి ఏ మాత్రం ఆద‌ర‌ణ‌ను ఇస్తున్నారో అంద‌రికీ తెలిసిందే. చిన్న‌ప్ప‌టి నుంచి అల్లారు ముద్దుగా పెంచి, పెద్ద చేసి, విద్యాబుధ్దులు చెప్పించి, ఒక ఇంటి వాడ‌య్యే వ‌ర‌కు తోడ్పాటును అందిస్తే… అంత‌టి సేవ చేసిన త‌ల్లిదండ్రులను నేటి త‌రం కొడుకులు అస్స‌లు లెక్క చేయ‌డం లేదు. నిర్ల‌క్ష్యంగా వ‌దిలేస్తున్నారు. లేదంటే వృద్ధాశ్ర‌మాల్లో వ‌దిలేసి వారిని విడిచిపెట్టి దూరంగా వెళ్లిపోతున్నారు. అయితే అలా ఒంటరిగా ఉంటున్న వృద్ధుల‌కు మేమున్నామంటూ తోడుగా నిలుస్తున్నారు ఆ ప్రాంత పోలీసులు. ముంబైలోని మ‌తుంగ అనే ప్రాంతానికి చెందిన పోలీసు సిబ్బంది ఆ ప్రాంతంలో ఉంటున్న వృద్ధుల‌ను క‌న్న త‌ల్లిదండ్రుల క‌న్నా ఎక్కువగా చూసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే వారు ఇటీవ‌ల ఓ వృద్ధురాలి జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను కూడా ఘ‌నంగా నిర్వ‌హించారు.

lalita-subramanyam

ఆమె పేరు ల‌లిత సుబ్ర‌హ్మ‌ణ్యం. వ‌య‌స్సు 83 సంవ‌త్స‌రాలు. ఆమెకు మొత్తం ముగ్గురు సంతానం. ఇద్ద‌రు అమెరికాలో, ఒక‌రు బెంగుళూరులో ఉంటారు. అయితే ఆమె మాత్రం ముంబైలోని వాడాలా అనే ప్రాంతంలో గ‌త 25 ఏళ్లుగా ఒక్క‌తే నివాసం ఉంటోంది. భ‌ర్త చ‌నిపోవ‌డంతో ఒంట‌రిగా మారింది. ఈ క్ర‌మంలో ఆమెను చూసేందుకు ఆ 25 సంవ‌త్స‌రాల‌లో త‌న పిల్ల‌లు ఎవ‌రూ రాలేదు. అయితే ఆమెకు మేమున్నామంటూ భ‌రోసానిచ్చారు, మతుంగ పోలీసులు. ఆమెకు కావ‌ల్సిన చిన్న చిన్న ప‌నుల‌ను చేసి పెట్టే వారు. బ‌య‌టికి వెళ్లి బ్యాంకు ప‌నులు చేయ‌డం, మందులు తేవ‌డం వంటి ప‌నులు కూడా చేస్తూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో ఆమె ఈ మ‌ధ్యే త‌న 83వ బ‌ర్త్‌డేను గ్రాండ్‌గా జ‌రుపుకుంది. కాదు, ఆ పోలీసులే ఘ‌నంగా జ‌రిపారు.

స్థానిక డీసీపీ అశోక్ దుదే, జోన‌ల్ డీసీపీ, ఇన్‌స్పెక్ట‌ర్ బీఎం క‌క‌ద్‌, ఇత‌ర కానిస్టేబుల్స్ అంద‌రూ ల‌లిత సుబ్ర‌హ్మ‌ణ్యం ఇంటిని స‌డెన్‌గా విజిట్ చేశారు. వారు వ‌స్తూ వ‌స్తూనే కేక్‌, ఇత‌ర డెక‌రేషన్ సామ‌గ్రి తెచ్చి ఆమె ఇంటిని అలంక‌రించి, బ‌ర్త్ డే వేడుక‌లు జ‌రిపారు. ఆమె చేత కేక్ క‌ట్ చేయించారు. అస్స‌లే పిల్ల‌లు రాక తీవ్ర మ‌న‌స్థ‌పాంతో ఉన్న ల‌లిత‌కు పోలీసులు అలా బ‌ర్త్ డే ను నిర్వ‌హించ‌డం ఎంతో ఆనందాన్నిచ్చింది. అయితే మ‌తుంగ పోలీసులు కేవ‌లం ల‌లిత‌కే కాదు, ఆ ఏరియ‌లో ఉంటున్న అనేక మంది సీనియ‌ర్ సిటిజెన్స్‌కు ఇలాగే స‌హాయం చేస్తున్నారు. ఎవరైనా అలాంటి వృద్ధులు ఉంటే అక్క‌డి టోల్‌ఫ్రీ నంబ‌ర్ 1090 కు డ‌య‌ల్ చేసి స‌హాయం కోర‌వ‌చ్చు. ఒంట‌రిగా ఉన్న వృద్ధులు, స‌హాయం కావ‌ల్సిన వారు పోలీసుల‌కు కాల్ చేయ‌వ‌చ్చు. నిజంగా అలాంటి స‌దుపాయం పెట్టినందుకు మ‌తుంగ పోలీసుల‌ను మ‌నం అభినందించాల్సిందే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top