ముక్కులోని వెంట్రుక‌ల‌ను తొలగించుకుంటున్నారా?..? అయితే జాగ్ర‌త్త‌..! బ్రెయిన్ ఇన్‌ఫెక్ష‌న్ వచ్చే ఆస్కారం ఉందట!

త‌ల‌పై ఉన్న వెంట్రుక‌లు పెరిగితే పురుషులు వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు క‌ట్ చేయించుకుంటారు. కొంత మంది మ‌హిళ‌లు, యువ‌తులు కూడా హెయిర్ క‌ట్ చేయించుకుని స్టైల్ చేసుకుంటారు లెండి. అది వేరే విష‌యం. అయితే పురుషులైనా, స్త్రీలైనా హెయిర్ క‌ట్ మాత్ర‌మే కాదు, ముక్కులో ఉన్న వెంట్రుక‌ల‌ను కూడా క‌ట్ చేయించుకుంటారు. అంత వ‌ర‌కు బాగానే ఉన్నా కొన్ని సంద‌ర్భాల్లో సెలూన్‌కు వెళ్ల‌కుండా ఇంట్లోనే ఆ ప‌ని చేస్తుంటారు. కొంద‌రు ముక్కులోని వెంట్రుక‌ల‌ను డైరెక్ట్‌గా ప‌ట్టుకుని లాగిన‌ట్టు తీసేస్తే, కొంద‌రు మాత్రం ప్ర‌త్యేక‌మైన మిష‌న్ల‌తో ముక్కులోప‌లంతా ఉన్న వెంట్రుక‌ల‌ను మూలాల వ‌ర‌కు క్లీన్ అండ్ గ్రీన్ చేసుకుంటారు. అయితే ఇలా చేయ‌డం ప్ర‌మాద‌క‌ర‌మ‌ట‌. ఎందుకంటే…

hair-in-nose

hair-in-nose
ముక్కులోని వెంట్రుక‌ల‌ను ప‌ట్టుకుని లాగితే ఆ వెంట్రుక‌లు ఉన్న ప్ర‌దేశంలో ఖాళీ ఏర్ప‌డుతుంది. ఒక్కోసారి తెలియకుండానే వెంట్రుక‌ల మూలం నుంచి ర‌క్తం వ‌స్తుంది. కానీ అది అన్ని సంద‌ర్భాల్లో బ‌య‌టి దాకా రాదు. ఈ క్ర‌మంలో అలా ఏర్ప‌డ్డ ఖాళీ లోప‌లికి ముక్కు లోప‌ల ఉండే బాక్టీరియా, వైర‌స్‌లు ప్ర‌వేశిస్తాయి. అనంత‌రం అక్క‌డి నుంచి ర‌క్త‌నాళాల్లోకి ప్ర‌యాణించి మెద‌డు దాకా వ్యాప్తి చెందుతాయి. ఎందుకంటే ముక్కు లోప‌లి నుంచి కొన్ని నాళాలు డైరెక్ట్‌గా మెద‌డుకు వెళ్తాయి కాబ‌ట్టి. ఈ క్ర‌మంలో మెద‌డుకు చేరిన బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్ల‌ను క‌లిగించి మ‌న‌ల్ని వ్యాధుల‌కు గురి చేస్తుంది. అలా వ‌చ్చే వ్యాధుల‌ను మెనింజైటిస్ అని పిలుస్తారు. ఇవి మ‌న‌కు చాలా ప్ర‌మాద‌క‌రం. ఒక్కో సారి ప్రాణాంత‌కాలుగా కూడా ప‌రిణ‌మించ‌వ‌చ్చు.

triangle-on-nose
చిత్రంలో చూపిన విధంగా ముక్కుపై త్రిభుజాన్ని గీయ‌గా వ‌చ్చే ప్ర‌దేశం మ‌న‌కు చాలా కీల‌కమైంద‌ట‌. దాన్ని అత్యంత సున్నిత‌మైన ప్ర‌దేశంగా మ‌నం భావించి అందుకు తగిన విధంగా ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ట‌. లేదంటే పైన చెప్పిన విధంగా వ్యాధుల‌కు గురయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే మ‌రి ముక్కులో బాగా వెంట్రుక‌లు పెరిగి ఇబ్బందిగా ఉంటే ఏం చేయాలి? అని మీరు అడిగితే అందుకు కూడా స‌మాధానం ఉంది. ఆ ప‌రిస్థితిలో ఏం చేయాలంటే ముందుగా ముక్కు లోప‌లి భాగాన్ని శుభ్ర‌మైన నీటితో క‌డిగేయాలి. దీంతో ప్ర‌మాద‌క‌ర‌మైన బాక్టీరియా దాదాపుగా న‌శిస్తుంది. అనంత‌రం అందులోని వెంట్రుక‌ల‌ను క‌త్తెర స‌హాయంతో క‌ట్ చేయాలి. అయితే వెంట్రుక‌ల మూలాల వ‌ర‌కు క‌ట్ చేయ‌కూడ‌దు. కేవ‌లం బ‌య‌టికి క‌నిపించే వెంట్రుక‌ల‌ను మాత్ర‌మే క‌ట్ చేసుకోవాలి. ఒక వేళ మిష‌న్ ఉప‌యోగించినా ఇదే విధంగా క‌ట్ చేయాలి. లేదంటే పైన చెప్పిన‌ట్టు వెంట్రుక‌లు ఊడిపోయి దాని స్థానంలో బాక్టీరియా ప్ర‌వేశించేందుకు అనువుగా మారుతుంది. కాబ‌ట్టి, ముక్కులోని వెంట్రుక‌ల‌ను క్లీన్ చేసే ముందు త‌ప్ప‌నిస‌రిగా జాగ్ర‌త్త వ‌హించండి!

Comments

comments

Share this post

scroll to top