ఈ శుక్రవారం లక్ష్మీదేవికి పూజచేసేటప్పుడు ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించండి.ఆర్థిక సమస్యలు తొలగుతాయ్.!

నేటి ఆధునిక ప్ర‌పంచంలో ధ‌నం విలువ ఎంత ఉందో అందరికీ తెలిసిందే. అది ఉంటేనే ఎన్నో స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయి. ఎంతో మంది జీవితాల‌కు అది అత్యంత ఆవ‌శ్య‌కం. అయితే ఈ ప్ర‌పంచంలో ఉన్న వారంద‌రూ ధ‌న‌వంతులు కారు. దాదాపు అన్ని వ‌ర్గాలకు చెందిన వారు ఉన్నారు. వారిలో కేవ‌లం కొంద‌రు మాత్ర‌మే అనుకున్న విధంగా ల‌క్ష్యాల‌ను చేరుకుని ధ‌నం సంపాదించ‌డంలో స‌ఫ‌లీకృతుల‌వుతున్నారు. కానీ అధిక శాతం మంది ధ‌నం సంపాదించ‌డంలో వెనుకంజ వేస్తున్నారు. కొంత మందైతే ధ‌నం సంపాదించినా దాన్ని ఏదో ఒక రూపంలో కోల్పోతున్నారు. అయితే మీకో విష‌యం తెలుసా? హిందూ శాస్త్రం ప్ర‌కారం అస‌లు ఏ వ్య‌క్తికైనా సంప‌ద‌లు సిద్ధించ‌డం కోసం ఏ దేవున్ని, దేవ‌త‌ను పూజించాలో? ఇంకెవ‌రు ల‌క్ష్మీ దేవిని, శ్రీ‌మ‌హావిష్ణువు అవ‌తావ‌రం అయిన వెంకటేశ్వ‌ర స్వామిని అంటారా? అయితే అది క‌రెక్టే కానీ, వారు అలా సంప‌ద‌ల‌ను అనుగ్ర‌హించాలంటే న‌వ‌గ్ర‌హాల్లో ఓ గ్ర‌హానికి మ‌నం పూజ‌లు చేయాల్సిందేన‌ట‌. ఆ గ్ర‌హాన్ని శాంత పరుస్తేనే మ‌న‌కు సంప‌ద‌లు క‌లుగుతాయ‌ట‌. అదే శుక్ర గ్ర‌హం.

shukra

భృగువు, ఉష అనే ఇద్ద‌రు దంప‌తుల కొడుకే శుక్రుడు. కాగా శుక్రుడు ఒకానొక సంద‌ర్భంలో శివుని కోసం ఘోర‌మైన త‌ప‌స్సు చేస్తాడు. ఈ క్ర‌మంలో శివుడు శుక్రుడి త‌ప‌స్సుకు, భ‌క్తికి మెచ్చి అత‌నికి వ‌రాల‌ను అనుగ్ర‌హిస్తాడు. శుక్రున్ని శివుడు సిరి సంప‌ద‌ల‌కు, అష్టైశ్వ‌ర్యాల‌కు, క‌ళ‌ల‌కు అధిప‌తిగానూ, రాక్ష‌సుల‌కు గురువుగానూ చేస్తాడు. దీంతోపాటు శుక్రునికి గ్ర‌హ మండ‌లంలో చోటు క‌ల్పిస్తాడు. అప్ప‌టి నుంచి శుక్రుడు న‌వ‌గ్ర‌హాల్లో ఒక‌డిగా పేరుగాంచాడు.

జాత‌కంలో శుక్ర మ‌హాద‌శ వస్తే ఎంతో అదృష్ట‌మ‌ని, అలాంటి వారికి అన్నీ క‌ల‌సి వ‌స్తాయ‌ని పండితులు చెబుతున్నారు. కాగా ఎవ‌రికైనా శుక్ర మ‌హాద‌శ కాలం 20 సంవ‌త్స‌రాల వ‌ర‌కు ఉంటుంద‌ట‌. ఆ స‌మ‌యంలో ఆ ద‌శ న‌డుస్తున్న వారికి ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతుంద‌ని, శుక్రుడు వారికి అన్నీ ఇస్తాడ‌ని జ్యోతిష్య శాస్త్రంలో ఉంది.

అయితే శుక్ర మ‌హాద‌శ లేని వారు, శుక్ర దోషం ఉన్న వారు కూడా శుక్రునికి పూజ‌లు చేస్తే దాదాపు అలాంటి ద‌శా ఫ‌లితమే పొంద‌వ‌చ్చ‌ట‌. అయితే అలాంటి వారు నేరుగా శుక్రున్ని కాకుండా శుక్ర‌వారం పూట ల‌క్ష్మీదేవిని పూజించాల‌ట‌. దీంతోపాటు అదే రోజున శివాల‌యానికి కూడా వెళ్లి పూజ‌లు చేసిన వారిని శుక్రుడు అనుగ్ర‌హించి వారికి సంప‌ద‌ల‌ను క‌లిగిస్తాడ‌ట‌. శుక్ర దోషం పోవాలంటే ప్ర‌తి శుక్ర‌వారం 108 సార్లు ‘ ఓం ద్రాం ద్రీం ద్రౌం సాహ్ శుక్ర‌యే న‌మః ‘ అనే శుక్ర బీజ మంత్రం ప‌ఠించాల‌ట‌. దీంతో శుక్ర‌దోషం పోయి అన్నీ శుభాలే క‌లుగుతాయ‌ట‌. ప్ర‌ధానంగా ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సంబంధ స‌మ‌స్య‌లు, అనారోగ్యం వంటి స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయ‌ట‌.

Comments

comments

Share this post

One Reply to “ఈ శుక్రవారం లక్ష్మీదేవికి పూజచేసేటప్పుడు ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించండి.ఆర్థిక సమస్యలు తొలగుతాయ్.!”

  1. Ravi Krishna Bandari says:

    mantram ekkada undi’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top