గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఇండియాను ముంచెత్తుతున్న చైనా ఫ్లాస్టిక్ బియ్యం, ఫ్లాస్టిక్ గుడ్డు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మీరు తినేది ఫ్లాస్టిక్ రైస్ అని తెలుసా? అంటూ న్యూస్ ఛానల్స్ సైతం కన్ఫ్యూజ్ చేస్తున్నాయి.! ఈ క్రమంలో అసలు ఫ్లాస్టిక్ బియ్యం సాధ్యమా? అనే వైపుగా కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించే ప్రయత్నం చేద్దాం.!!
- ఫ్లాస్టిక్ బియ్యం అనేది ఓ తప్పుడు ప్రచారం…దానికి గల కారణాలను ఒక్కొక్కటిగా తెల్సుకుందాం.
- Kg ప్లాస్టిక్ రేటు ఒక kg బియ్యం కంటే ఎక్కువ రేటు వుంటుంది దానిని ప్రాసెస్ చేసి బియ్యంరేటుకు అమ్మడం అంత లాభదాయకం కాదు .
- హేండీక్రాఫ్ట్ బజారులో ఒక చెక్క కోడిగుడ్డు 30 రూపాయలు , పిల్లలు ఆడుకునే చిన్న ప్లాస్టిక్ బొమ్మ 10రూ అటువంటప్పుడు 5 రూపాయలకే ప్లాస్టిక్ గుడ్డు తయారు చేసి అమ్మితే వారికేం లాభ0.?
- అన్నం లో వుండే కార్బోహైడ్రేట్లు అధిక పీడన ఉష్ణోగ్రతలు వద్ద ఉడికించి ముద్దగా చుట్టి గట్టిగా ఒత్తడం వలన కార్బోహైడ్రేట్లు మధ్య పాలిమర్ బంధాలు ఏర్పడి గట్టిగ ధృడంగా పెద్ద పాలిమర్ గా మారే అవకాశముంది . అంతమాత్రాన ఆ అన్నంలో ప్లాస్టిక్ ఉంది అనలేం .!
- అన్నాన్ని మెత్తగా నూరితే ఫెవికాల్ కంటే గొప్ప పాలిమర్ ఎతెసివ్ గా పనిచేస్తుంది , ఇప్పటికీ పల్లెల్లో డప్పులు తయారు చేసేటపుడు చర్మాన్ని చెక్క ఫ్రేమ్ కు అతికించటానికి ఈ విధానాన్నే ఉపయోగిస్తారు.
- నిజానికి ప్లాస్టిక్ హైడ్రోఫోబిక్ అంటే నీటితో కలవదు అన్నంలో 70% నీరు వుంటుంది అందులో ప్లాస్టిక్ వుంటే ఉడికేటప్పుడే పైకి తేలిపోతుంది అంతేగాని అన్నంతో కలవదు.
- ఒక్క విషయం కల్తీ చేస్తే లాభాలు వస్తాయంటే…కల్తీకి అవకాశం ఉంది, కల్తీ చేసి మరీ నష్టాలు కొని తెచ్చుకోవాలని ఏ వ్యాపారీ చూడడు.!
- సో….ఇది తప్పుడు ప్రచారం అనేది కొందరి వాదన.!
- ఈ ఫ్లాస్టిక్ రైస్ ప్రచారంపై ప్రభుత్వం ఓ ప్రకటన ఇస్తే బాగుంటుంది. సైంటిఫిక్ గా దాని సాద్యాసాద్యాల గురించి ప్రజలకు చెబితే అనవసర భయాలు తొలగిపోతాయి.!
Source: UNKNOWN. Via: FB, WhatsApp.