ఆమ్లెట్ వేద్దామని ఆమె “గుడ్డు” పగలగొడితే…అందులో “ప్లాస్టిక్” వచ్చింది! చివరికి “ప్లాస్టిక్ ఆమ్లెట్” అయ్యింది!

ఎదో వాడుక భాషలో అప్పుడప్పుడు “గాడిద గుడ్డు” అంటుంటాము. కానీ చిత్రంగా “ప్లాస్టిక్ గుడ్లు” చూడాల్సి వస్తుంది. సాయంకాలం ఆకలేస్తున్నప్పుడు బ్రెడ్ తో పాటు ఆమ్లెట్ వేసుకొని తింటుంటే వచ్చే ఆనందమే వేరు. అలాగే ఆమ్లెట్ వేసుకుందామని ఓ మహిళా గుడ్డు పగలకొట్టింది. చిత్రంగా అందులో ప్లాస్టిక్ వచ్చింది. చివరికి అది ప్లాస్టిక్ ఆమ్లెట్ అయ్యింది! వివరాలు మీరే చూడండి!

కోల్ కతాలో నకిలీ గుడ్లను అమ్ముతున్నారు. అలా అమ్మిన గుడ్లను ఆమ్లెట్ వస్తే ఇలా తయారయ్యాయి. ఆ నగరానికి చెందిన అనితాకుమార్ వేసిన ఆమ్లెట్ ఇదే. ప్లాస్టిక్ తరహాలో ఉన్న నకిలీ గుడ్లను అమ్ముతున్న ఓ వ్యాపారిని కోల్‌కతాలో శుక్రవారం అరెస్టు చేశారు. గుడ్డును కొనుగోలు చేసి ఇంటికి వెళ్లి ఆమ్లెట్ వేస్తే ప్లాస్టిక్‌లా కరిగి పెనానికి అంటుకుపోయిందని, వాసన కూడా ప్లాస్టిక్ తరహాలోనే ఉందని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అనితాకుమార్ అనే మహిళ ఫిర్యాదు మేరకు నగరంలోని పార్క్ సర్కస్ మార్కెట్‌లో దుకాణం నడుపుతున్న షమీమ్ అన్సారీ అనే వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. అనుమానం వచ్చి అగ్గిపుల్ల గీసి అంటిస్తే ఆమ్లెట్ బరబరా కాలిపోయిందని ఫిర్యాదు చేసిన మహిళ తెలిపారు. ఆ గుడ్లను తింటే కడుపులో తిప్పుతున్నదని ఆమె పేర్కొన్నారు. శాంపిల్‌ను పరీక్షలకు పంపి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Comments

comments

Share this post

scroll to top