“ఇస్రో” విజయం సందర్బంగా “పిజ్జా హట్” రెండు రోజులు “ఫ్రీ పిజ్జా” ఆఫర్ పెట్టింది!.కానీ షరతులు చూస్తే..

ISRO  (Indian Space Research Organization) నిన్న భారత జాతి ప్రతిభను ప్రపంచానికి చాటింది!..ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించి ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది!…ఆంధ్ర ప్రదేశ్ “శ్రీహరికోట” నుండి ఉపగ్రహాలు నింగికి ఎగసాయి!…భారతీయులు అందరు ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా ఇస్రో సైంటిస్ట్స్ లకు శుభాకాంక్షలు అందచేశారు!… ఇది అలా ఉండగా ఇస్రో శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు చెప్పుకుంటూ “పిజ్జా హట్” ఒక కొత్త ఆఫర్ తో ముందుకి వచ్చింది!…15 , 16 తారీకున ఉచితంగా పిజ్జా అందిస్తున్నట్టు ప్రకటించింది..కానీ దానికి కొన్ని షరతులు పెట్టింది!

షరతులు ఏంటో ఒక లుక్ వేసుకోండి!

  • పిజ్జా హట్ ఫ్రీ గా ఒక “పాన్ పిజ్జా” అందిస్తుంది అంట..కాకపోతే అది “ఇస్రో” లో పని చేసే వారికి మాత్రమే!
  • ఇస్రో లో పని చేసేవారు అయినప్పటికీ “వాక్ – ఇన్” కస్టమర్స్ కి మాత్రమే ఈ ఫ్రీ పిజ్జా!
  • హోమ్ డెలివరీ పై ఇది వర్తించదు!
  • ఏ పాన్ పిజ్జా ఇవ్వాలనేది స్టోర్ ఇష్టం
  • ఇస్రో లో పని చేసే వారు ఐ డి కార్డు చూపించి…ఈ ఆఫర్ ని అనౌన్స్ చేసిన తరవాతే పిజ్జా ఇస్తారంట
  • ఎయిర్ పోర్ట్ పిజ్జా హట్ లో ఈ ఆఫర్ లేదు!
  • స్టాక్ ఉన్నంత వరకే ఈ ఆఫర్!
  • నోటీసు ఏం ఇవ్వకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫర్ తీసేయొచ్చు అంట యాజమాన్యం!

ఈ మాత్రం దానికి ఆఫర్ పెట్టడం ఎందుకో?…అయినా ఇస్రో లో పని చేసేవారు ఎంచక్కా కావాల్సింది కొనుక్కొని తినగలరు..పాన్ పిజ్జా కోసం ఎందుకు ఎగబడతారు!

 

Comments

comments

Share this post

scroll to top