తనను పెంచిన రైతు ఆత్మహత్య చేసుకోడాన్ని చూసి తాను ఆత్మహత్య చేసుకున్న కోడి.!? మనస్సును కదిలించింది.

‘కొక్కోరోకో అని ఊరంతా  నిదురలేపి..  ఉదయానికి స్వాగతం పలుకుతూ.. కోటెక్కిన మహారాజులా కూర్చుంటుంది కోడి’. ప్రతిరోజూ మనచుట్టూ తిరిగే ఈ కోడిని ఆదివారం రాగానే కసాకసా చంపేసి, వండుకొని కడుపారా ఆరగిస్తాం. మూగజీవి కదా ఏమీ అనలేదనే కారణంతో పుష్టిగా భోజనం చేస్తాం. అయితే మూగజంతువులకు ఓ మనసుంటుందని, తనను పోషించే యజమానిని తండ్రిలా చూసుకుంటుందని, యజమానితో కోడికి ఉండే అనుబంధం ఎలా ఉంటుందో మీరు చూశారా? ఒక కుటుంబం తనను ప్రేమగా చూసుకుంటే, అంతకుమించిన ప్రేమను తిరిగిస్తాను అని  రైతుల కోసం సాగే ‘పిట్టకథ’ను మనసుకు హత్తుకునేలా చెప్పాడు దర్శకుడు ప్రదీప్ మీసాల.
పచ్చని పొలాలు, ఎడ్లబండ్లు, చెరువుగట్లు, ఆప్యాయంగా పలకరించుకునే మనుషులు.. ఈ వాతావరణమంతా కోస్తా ప్రాంతంలోని కేశనపల్లి గ్రామంలో ఉంటుంది. పొలం దుక్కుకుంటూ, భూతల్లినే నమ్ముకునే వ్యవసాయం చేసుకుంటున్న ఒక రైతు కుటుంబం , ఈ కథలో హీరో అయిన కోడిని కొడుకులా పెంచుకుంటూ ఉంటాడు. ఒకరోజు గంపకింద దాచిపెట్టిన ఆ కోడిని డబ్బుల కోసం ఎవడో చికెన్ షాపులో అమ్మేస్తాడు. ఆ రాత్రంతా తనను ఎక్కడ చంపుతారో అని  భయంభయంగా గడిపిన కోడి, ఉదయాన్నే కొక్కోరోకో అని కూతవేయలేకపోయింది. తను చావకూడదు, తన యజమానిని కలుసుకోవాలని అక్కడి నుండి తప్పించుకొని చెట్టు, పుట్ట, వాగు, వంక దాటుకొని ఇంటికి చేరుతుంది. ఇంటికొచ్చిన తనను చూసి, యజమాని సంతోషపడతాడనుకుంటూ గడపదాటగానే, శవాలుగా పడి ఉన్న తన యజమాని కుటుంబాన్ని చూస్తూ బరువెక్కిన గుండెతో కిందపడిపోతుంది. అకాల వర్షాల కారణంగా చేతికందాల్సిన పంట నీట మునగడంతో ఆ రైతు కుటుంబం విషం తాగి  ఆత్మహత్య చేసుకుంది. వారితోనే జీవనం అనుకున్న ఆ మూగజీవి అక్కడే ఉన్న విషఆహారాన్ని తీసుకొని తను వారిదగ్గరికే చేరింది.
అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం దేశంలో అన్నంపెట్టే రైతన్న ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. చేసిన అప్పులు తీర్చలేక, చేతికందాల్సిన పంట నీటిమయమైతే, కుటుంబాన్ని ఆదుకోలేక  ఆత్మహత్యే శరణుగా ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాడు. ఆదుకోవడానికి, చేదోడుగా నిలవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రాణాలు తీసుకుంటున్నాడు. ఇప్పటికైనా రైతు మరణాలను ఆపాలని, ప్రభుత్వం పెద్ద మసనుతో వారికి అండగా నిలవాలని కోరుకుంటూ చేసిన ఈ ప్రయత్నం చాలా గొప్పది.
Watch Short Film Pitta katha:

Comments

comments

Share this post

scroll to top