తాగి విమానం న‌డుపుతున్న పైల‌ట్లు..! తేడా వస్తే అంతా తలకిందులే!!

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు…బైక్ లు, కార్లు నడిపే వాళ్ల మీదే కాదు, విమానాలను నడిపే పైలెట్ల మీద కూడా నమోదవుతున్నాయి.దాదాపు 250 మంది ప్రయాణికులను తమ తమ గమ్యస్థానాలకు చేర్చాల్సిన పైలెట్లు…పెగ్గు మీద పెగ్గేసి మరీ…..విమానాల స్టీరింగ్ లు చేతపడుతున్నారంట.! ఈ విషయాన్ని స్వంయంగా  DGCA  (డైరెక్ట‌రేట్ జ‌న‌రల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్) చెబుతున్న‌దే! కొంతమంది పైలెట్లే కాదు  విమానాల్లో విధులు నిర్వహించే సిబ్బంది కూడా మద్యం మత్తులోనే విధులు నిర్వహిస్తున్నారట.!

pilot-flight-drinking

2016  జ‌న‌వ‌రి 1 నుంచి అక్టోబ‌ర్ 31 వ‌ర‌కు దేశంలోని ప‌లు ఎయిర్ లైన్స్‌లో ప‌నిచేస్తున్న పైల‌ట్లు, ఇత‌ర సిబ్బందికి DGCA బ్రీత్ అన‌లైజర్‌తోపాటు ప‌లు ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. వాటిలో తెలిసిందేమిటంటే… 38 మంది పైల‌ట్లు, 113 మంది విమాన సిబ్బంది మ‌ద్యం సేవించి విమానాల‌ను న‌డుపుతున్నారట!  దీంతో స‌ద‌రు ఉద్యోగులు, పైల‌ట్లను విధుల నుంచి త‌ప్పించాల‌ని డీజీసీఏ సంబంధిత ఎయిర్‌లైన్ల కంపెనీల‌కు ఆదేశాలు జారీ చేసింది.

250 మందికి పైగా ప్రయాణికుల ప్రాణాలు తమ చేతిలో ఉన్న పైలట్లు ఇలా చేయడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు.

Comments

comments

Share this post

scroll to top