పిల్లలు మద్యం తాగితే …అది మీ తప్పే…

తరగతి గదికి తప్ప తాగి వచ్చారన్న నెపంతో బాలికలకు టీసీ ఇచ్చి పంపిన ఘటనపై బాలల హక్కుల కమిషన్
సీరియస్ అయింది. ఈ వ్యవహారంపై ద్రుష్టి సారించిన బాలల హక్కుల కమిషన్  పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై
ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని, ఏమరపాటుగా ఉంటే ఇలాంటి ఘటనలే చోటు
చేసుకుంటాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలిసి తెలుసని వయసులో చేసిన తప్పులకు టీసీ ఇచ్చి బాలికలను
పాఠశాల నుండి పంపించడం ఏంటని ప్రశ్నించింది. ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు పిల్లలకు కొంత కాలం
పాటు కౌన్సెలింగ్ అవసరమని సూచించింది. అనాలోచితంగా చేసిన తప్పును సరిదిద్ది బాలికలకు మంచి మార్గంలో
నడిపించేందుకు కృషి చేయాల్సింది పోయి టీసీ ఇచ్చి చేతులు దులుపుకోవడంతో హెడ్ మాస్టర్ పై బాలల హక్కుల
కమిషన్ మండిపడింది. కృష్ణ జిల్లాలో బాలికల మధ్యం సేవించి  పాఠశాలకు వచ్చిన ఘటననుగా సీరియస్ తీసుకుని
విచారిస్తున్న  బాలల హక్కుల కమిషనర్ హైమావతి పై విదంగా స్పందించారు.

కృష్ణ జిల్లా నిడమలూరు మండలంలోని, జిల్లా పరిషత్ పాఠశాలలో  బాలికలు మద్యం తాగి పాఠశాలకు రావడంతో హెడ్
మాస్టర్ ఆ ఇద్దరి విద్యార్థులను టీసీ ఇచ్చి పంపిన ఘటన కలకలం రేగటంతో రంగంలోకి దిగిన బాలల హక్కుల కమిషన్
విచారణ చేపట్టింది. పాఠశాలలో తొమ్మిదో తరగతికి చెందిన ఇద్దరు బాలికలు తరగతి గదిలో వాటర్ బాటిల్లో మద్యం
కలుపుకుని సేవించారు. ఆ ఇద్దరు తాగి తూలుతూ ఉండటం, వారి వద్ద నుండి మద్యం వాసన వస్తుండటంతో
గమనించిన తోటి విద్యార్థులు పాఠశాల హెడ్ మాస్టర్ సురేష్ కుమార్ కు ఈ విషయం చేరవేశారు. విషయం
తెలుసుకున్న హెడ్ మాస్టర్ వారిద్దరికీ టీసీ ఇచ్చి పంపించారు. ఈ విషయం బాలల హక్కుల కమిషన్ వరకు వెళ్లడంతో
రంగంలోకి దిగిన కమిషన్ చైర్మన్ హైమావతి పాఠశాల హెడ్ మాస్టర్ తో పాటు 50 మంది ఉపాధ్యాయులను
విచారించారు. పాఠశాలలో పిల్లను ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తూ ఉండాలని లేని పక్షంలో ఇలాంటి ఘటనలే జరుగుతాయని
ఘాటుగా స్పందించింది. ఇదే కాకా ఇంతకూ ముందు ఇదే తరహా ఘటనలు జరిగాయని తమకు పిర్యాదులు
అందాయని, తప్పు చేసిన పిల్లలను సరిదిద్దడం మాని టీసీ ఇచ్చి పంపడం ఏంటని మండిపడ్డారు. విద్యార్థులకు
విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణ నేర్పాల్సిన బాధ్యత  ఉపాధ్యాయులదే అన్నారు. పిల్లల ప్రవర్తన  అనుమానాస్పదంగా
ఉందని గ్రహించినపుడు  పిల్లలకు కౌన్సిలింగ్ ఇప్పించాలన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన విద్యార్థులకు పదిహేను
రోజుల పాటు బాలల సదన్ లో కాన్సెలింగ్ ఇప్పిస్తే పరిస్థితిలో మార్పు వస్తుందని అన్నారు. పాఠశాలలో చదివే ప్రతి
విద్యార్థిపై ఉపాధ్యాయులు వ్యక్తిగత శ్రద్ద పెట్టాలని సూచించారు. కనీసం వారానికి ఒకసారైనా  పిల్లలకు  మానసిక
వైద్యుల తో అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయాలనీ అన్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా
చూసుకోవాలని, పిల్లలపై ఉపాధ్యాయుల పర్యవేక్షణ లేకపోతె కఠిన చర్యలు తీసుకుంటామంటూ బాలల హక్కుల
కమిషన్  హెచ్చరించింది.

Comments

comments

Share this post

scroll to top