ఈమె జీవితం….పిల్లల పై అనవసరంగా చదువు ఒత్తిడి తెస్తున్న ప్రతి తల్లిదండ్రికి పాఠం.

ఈమె పేరు నిమిషా వ‌ర్మ‌. వ‌య‌స్సు 19 ఏళ్లు. త‌న సోద‌రుడి పేరు సుధాంశు. వీరిది రాజ‌స్థాన్‌లోని జైపూర్. వీరికి ఫైన్ ఆర్ట్స్ అంటే ప్రాణం. ఆ కోవ‌లోనే ఫైన్ ఆర్ట్స్‌లో కెరీరే వారు ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. అందులో నిష్ణాతులు కావాల‌ని అనుకున్నారు. అయితే అంద‌రు త‌ల్లిదండ్రులలాగే వీరి త‌ల్లిదండ్రులు కూడా మ‌రో కోర్సును చ‌ద‌వాల‌ని బ‌ల‌వంత పెట్టారు. ఆ అక్కాత‌మ్ముడు ఎంత చెప్పినా వారు విన‌లేదు. దీంతో ఇద్ద‌రూ బ‌య‌టికి రావాల‌ని అనుకున్నారు. అలాగే వ‌చ్చేశారు. త‌ల్లిదండ్రుల‌ను వ‌దిలి పెట్టి బ‌య‌టి ప్ర‌పంచంలోకి వ‌చ్చాక వారికి తిండికి, నిద్రకి బాగా క‌ష్ట‌త‌ర‌మైంది. అలా మొద‌టి 4 రోజుల పాటు ఎలాగోలా స‌ర్దుకున్నారు. అనంత‌రం వారి జీవిత‌మే మారిపోయింది. ఎట్ట‌కేల‌కు ఫైన్ ఆర్ట్స్‌లో త‌మ కెరీర్‌ను పూర్తి చేసుకున్నారు. మంచి క‌ళాకారులుగా పేరు తెచ్చుకున్నారు. అయితే వారిద్దరూ అంత‌టితో ఆగ‌లేదు.
త‌మ‌లా క‌ళల‌నే కెరీర్ మార్చుకున్న వారికి కూడా స‌హాయం అందించాల‌ని అనుకున్నారు. అలాంటి వారంద‌రినీ ఒక్క చోట‌కు చేర్చాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. అనుకున్న  వెంట‌నే త‌మ ప్ర‌ణాళిక‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్టారు. ఓ పెద్ద ఇంటిని తీసుకుని దానికి హోమ్ ఫ‌ర్ ఆర్టిస్ట్స్ అని పేరు పెట్టారు. అందులోకి క‌ళ‌ల‌ను అభ్య‌సించే  వారికి ఉచితంగా ఎంట్రీ క‌ల్పిస్తున్నారు. ఎవ‌రైనా ఫైన్ ఆర్ట్స్‌ను అభ్య‌సించాల‌నుకునే వారు, అభ్య‌సిస్తున్న వారు ఆ హోమ్‌లో ఒక‌టి రెండు రోజులు ఉచితంగా ఉండేందుకు వీలు క‌ల్పించారు. అయితే ఎక్కువ రోజులు ఉన్నా నామ మాత్ర‌పు అద్దెతో క‌ళాకారుల‌కు సేవ‌ల‌ను అందిస్తున్నారు.
843324845
నిమిషా వ‌ర్మ‌, సుధాంశులు ఏర్పాటు చేసిన హోమ్ ఫ‌ర్ ఆర్టిస్ట్స్‌లో క‌ళాకారుల‌కు నిత్యం రెండు పూట‌లా భోజ‌నం పెడ‌తారు. ఉద‌యం, రాత్రి వేళ‌ల్లో ఉచితంగా భోజ‌నం, సాయంత్రం స్నాక్స్‌, టీల‌ను కూడా ఉచితంగా అందిస్తారు. అయితే మ‌ధ్యాహ్నం భోజ‌నం అందుబాటులో ఉండ‌దు. కావాలంటే ఎవ‌రైనా బ‌య‌టికి వెళ్లి తిని రావ‌చ్చు. అయిన‌ప్ప‌టికీ ఆ ఇద్ద‌రు ఏర్పాటు చేసిన క‌ళకారుల గృహంలో ఇప్పుడు చాలా మంది క‌ళాకారులే ఉంటున్నారు. వారంతా రోజు మొత్తం త‌మ‌కు కావ‌ల్సిన మెళ‌కువ‌ల‌ను నేర్చుకోవ‌డ‌మే కాదు, కొత్త వారికి పెయింటింగ్‌, డ్రాయింగ్ నేర్పుతారు. ఒక‌రి ఐడియాల‌ను మ‌రొకరు షేర్ చేసుకుంటారు. దీన్నంత‌టినీ చూసిన నిమిషా వ‌ర్మ ఇన్నాళ్ల‌కు త‌మ క‌ల సాకార‌మైంద‌ని చెబుతోంది. అయితే తాను అంత‌టితో ఆగ‌న‌ని, త్వ‌ర‌లో ఫైన్ ఆర్ట్స్ క‌ళాకారుల కోసం ఓ యూనివ‌ర్సిటీనే పెడ‌తాన‌ని ధీమాగా చెబుతోంది. ఆమె డ్రీమ్ నెర‌వేరాల‌ని మ‌న‌మూ ఆశిద్దాం..!

Comments

comments

Share this post

scroll to top