పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయడం వెనుక ఉన్న అసలు నిజం ఏమిటి..?

హిందూ సాంప్రదాయంలో పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయడం ఎప్పటి నుంచో ఉంది. అధిక శాతం మంది తమకు దేవుడి మొక్కు ఉందని చెప్పి చిన్నారులకు పుట్టు వెంట్రుకలను తీస్తారు. అయితే ఇదే విధానం ఇతర మతాలు, కులాలకు చెందిన వర్గీయుల్లోనూ ఉంది. వారంతా రక రకాలుగా ఈ ఆచారాన్ని పాటిస్తారు. అయితే ఇలా పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయడంలో మాత్రం పలు ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. వేదాల ప్రకారం చిన్నారులకు మొదటి లేదా 3వ సంవత్సంలో పుట్టు వెంట్రుకలను తీయాలి. అలా కాకుండా చేస్తే అది పెద్ద తప్పవుతుంది. అంతే కాదు పిల్లల చుట్టూ ఎల్లప్పుడూ దుష్టశక్తుల ప్రభావం ఉంటుంది.
2. పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీసే సమయంలో తల్లి తరపు తాత, అమ్మమ్మ దగ్గర ఉండకూడదని అనేక మంది భావిస్తారు. ఎందుకంటే ఇది పిల్లలకు దురదృష్టాన్ని కలిగిస్తుంది.
3. కొన్ని వర్గాల్లో తండ్రి తరపు సోదరి పిల్లలను పుట్టు వెంట్రుకలు తీయించేందుకు తీసుకెళ్లే ఆచారం ఉంది. ఆ పిల్లలకు పేరు పెట్టేందుకు కూడా వారికి అధికారం ఉంటుంది.
4. తల్లి గర్భంలో ఉండగానే చిన్నారులకు వెంట్రుకలు పెరుగుతాయి. చిన్నారి తలపై వెంట్రుకలు ఉంటే అది వారి అభివృద్ధికి అడ్డుగా నిలుస్తుందని పురాతన కాలంలో నమ్మేవారు. ఈ నేపథ్యంలోనే దుష్ట శక్తుల బారి నుంచి రక్షించేందుకు చిన్నారులకు పుట్టు వెంట్రుకలను తీయించేవారు. ఇది పిల్లలకు మానసిక, ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. అంతేకాదు వారి అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది.
5. పిల్లలకు తరచూ గుండు గీయిస్తే వెంట్రుకలు త్వరగా పెరగడంతోపాటు అవి దృఢంగా మారతాయని అనేక మంది నమ్ముతారు. కానీ ఇందులో ఎంతమాత్రం నిజం లేదని పరిశోధకులు చెబుతున్నారు.
6. వెంట్రుకలను తీసిన తరువాత వాటిని అలాగే పడేయవద్దని హిందువులు నమ్ముతారు. వాటిని గంగలో లేదా దాని ఉపనదుల్లో కలిపితేనే చేసిన పనికి సార్థకత లభిస్తుందని వారి విశ్వాసం.
7. పుట్టు వెంట్రుకలను తీయించకపోతే చిన్నారులపై ఇతరుల దిష్టి ప్రభావం పడుతుందని విశ్వసిస్తారు.
8. బాలురు, బాలికలకు పుట్టు వెంట్రుకలను భిన్న రకాలుగా తీస్తారు. బాలికలకైతే తలపై వెంట్రుకలను పూర్తిగా తీస్తారు. అదే బాలురకైతే పిలకలాగా కొన్ని వెంట్రుకలను అలాగే ఉంచుతారు.
9. పుట్టు వెంట్రుకల తంతు ముగిసిన తరువాత చిన్నారి తలపై పసుపు లేదా చందనం మిశ్రమాన్ని పూతగా పూస్తారు. దీంతో చిన్నారి పరిశుద్ధమవుతుంది.

Comments

comments

Share this post

scroll to top