బిస్కెట్లు తినడం ఎంత ప్రమాదమూ తెలుసా..??

చిన్న పిల్లలకు బిస్కెట్లు అంటే చాలా ఇష్టం. పెద్దలు కూడా స్నాక్స్ కింద అప్పుడప్పుడు బిస్కెట్లు తింటూ ఉంటారు. అయితే బిస్కెట్లు ఆరోగ్యానికి చేటు చేస్తాంటున్నారు వైద్యులు. బిస్కెట్ల తయారీలో అధిక ఉష్ణోగ్రతలో నూనె, డాల్డా వంటివి వేడి అవుతాయి. అలా వేడైనప్పుడు ఆమ్లాలు పుట్టుకొస్తాయి. ఈ ఆమ్లాలు శరీరంలో అధికంగా చేరడంతో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇవి గుండె జబ్బులకు కారణమవుతాయి. బిస్కెట్లు ఎక్కువ కాలం చెడిపోకుండా నిల్వ ఉండేందుకు ఉప్పును అధికంగా వాడతారు. దీని వల్ల హైబీపీ వస్తుందంటున్నారు వైద్యులు. హైబీపీ ఉన్న వాళ్లు బిస్కెట్లు తినకపోవడం మంచిదంటున్నారు.

బిస్కెట్ల తయారీలో ఈస్ట్, సుక్రోస్, పంచదార వంటి వాటిని వాడతారు. పంచదార, సోడియం అధికంగా ఉండే బిస్కెట్లు తినడం వల్ల మధుమేహం వచ్చే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. ఎక్కువగా పిల్లలకు బిస్కెట్లను ఇవ్వకూడదు, ఇలా చెయ్యడం వల్ల పిల్లల్లో ఆకలి చచ్చిపోతుంది. కొందరు పిల్లలకు పాలల్లో బిస్కెట్లు ముంచి ఇస్తుంటారు. క్రీం బిస్కెట్లు పాలల్లో ముంచి ఇవ్వడం అసలు మంచిది కాదు. దీని వల్ల పిల్లల్లో అజీర్ణం సమస్య ఏర్పడుతుంది. ఇక పిల్లలకు ఎక్కువగా బిస్కెట్లు ఇవ్వడం వల్ల వారిలో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top