పిల్లల గొంతులో ఏదైనా ఇరుక్కుంటే…ఈ రెండు విధాలుగా చేయండి..చేయకూడని రెండు పనులేంటంటే?

దోసె ముక్క గొంతులో ఇరుక్కుని ఈ మధ్య ఒక పసిప్రాణం పోయింది..ఇదే కాదు మనం వార్తల్లో ఇప్పటికీ చాల చూసాం.గొంతులో చిక్కుడు గింజ ఇరుక్కుపోయి ప్రాణం పోయిన చిన్నారి..ఆహారం అడ్డుపడి ప్రాణం వదిలిన చిన్నారి..అంటూ ఎన్ని వార్తలొచ్చినా పిల్లల విషయంలో అజాగ్రత్తగా ఉంటాం..వారి దగ్గర పెట్టకూడని వస్తువులు పెడుతుంటాం ..పిన్నులు,ప్లాస్టిక్ సంభందమైనవి..దాని ద్వారా పెద్ద మూల్యమే చెల్లించుకుంటాం..కాబట్టి కొన్ని జాగ్రత్తలు  ,పద్దతులు పాటిస్తే అలాంటి సంధర్బాల్లో పిల్లల్ని రక్షించుకోవచ్చు..

  •  గొంతులో ఆహారం కానీ,ఏదన్నా వస్తువు కానీ ఇరుక్కుపోయినప్పుడు, మీరు వెంటనే ఒక కుర్చీపై కూర్చొని పిల్లలను తల కిందకు ఉండేలా కాళ్ళపై బోర్లా పడుకోబెట్టాలి. ఆ తర్వాత వీపుపై నాలుగు సార్లు చరుస్తూ ఒత్తిడి తీసుకురావాలి. మీ కాళ్ళ ఒత్తిడి పిల్లల కడుపుపై ఉండటం వలన త్వరగా అడ్డుపడ్డ పదార్థం బయటకు వస్తుంది. అలాగే నడుం నుండి రెండు భుజాల మధ్యగా పై వైపుకు కదిలిస్తే అడ్డుపడ్డ పదార్థం వెంటనే బయటకు వస్తుంది.
  • పిల్లల గొంతులో ఆహారం ఇరుక్కుంటే ముందుగా పిల్లలకు ఎడమ పక్కగా నిలబడి వీపుపై నాలుగు ఐదు సార్లు చిన్నగా కొట్టడం లేదా చరుస్తూ ఉండాలి. మరో చేత్తో పిల్లల ఛాతీపై ఒత్తిడి పెరిగేలా ఉంచి, పిల్లల తలను కిందకు ఉండేలా చూసుకోవాలి. ఇలా చేసిన తర్వాత పిల్లల తలను కాస్త పైకి నోటి దవడలు తెరిచి చేతి వేళ్ళ సాయంతో ఇరుక్కున్న పదార్థాలను బయటకు తీయాలి. ఇలా చేస్తే సులభంగా గొంతులో ఇరుక్కుపోయిన పదార్థాలు బయటకు వస్తాయి.
  • ఏదైనా పదార్థం గొంతులో ఇరుక్కున్నప్పుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడిపోతూ ఏడుస్తూ దగ్గటం చేస్తూ ఉంటారు. అటువంటప్పుడు వారిని ఆపకండి. ఇలా ఆపడం వలన భయంతో అలాగే ఉండిపోతారు. శ్వాసతీసుకోవడం కష్టమవుతుంది.  పైన చెప్పినట్లు చేసినా ఆహార పదార్థాలు బయటకు రాకపోతే వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళండి.
  • పిల్లలకు మెత్తగా ఉడికిన ఆహారమే పెట్టాలి..అలా కాకుండా  కాయిన్స్, పిన్నీసులు, నాణెములు, బెలూన్స్, పూసలు, గట్టిగా ఉండే విత్తనాలు, క్యారెట్, ఫ్రూట్స్ ముక్కలు, చాకోలెట్స్ వంటివి ఉంచకూడదు.

Comments

comments

Share this post

scroll to top