విరాట్ పిలకపోయినా “మాల్యా” వచ్చాడు..! అతన్ని చూసి తింటున్న టీం ఇండియా జట్టు ఏం చేసిందో తెలుసా..?

లిక్క‌ర్ మాల్యా… అదేనండీ విజ‌య్ మాల్యా..! గుర్తున్నాడుగా. అవును, గుర్తు లేకేం. బ్యాంకుల‌కు రూ.9వేల కోట్లు శ‌ఠ‌గోపం పెట్టి ఏడాది క్రితం త‌ప్పించుకుని లండ‌న్ పారిపోయాడుగా. అత‌ని పుణ్య‌మా అని చాలా బ్యాంకుల‌కు కోలుకోలేని దెబ్బ ప‌డింది. ఓ ద‌శ‌లో మాల్యా రుణాల‌ను బ్యాంకులు మాఫీ చేయ‌నున్నాయ‌ని వార్త‌లు కూడా వ‌చ్చాయి. గుర్తు లేకేం, అత‌ను చేసిన మోసం అంతా ఇంతా కాదుగా. అయినా అయిపోయిన సంగ‌తి ఇప్పుడెందుకు అంటారా..? ఏమీ లేదండీ… స‌ద‌రు లిక్క‌ర్ మాల్యా అలియాస్ విజ‌య్ మాల్యాను లండ‌న్ పోలీసులు ఇటీవలే అరెస్టు చేశారు కదా..!

ప్రస్తుతం టీం ఇండియా ఇంగ్లాండ్ లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్న సంగతి అందరికి తెలిసిందే.  విరాట్‌ కోహ్లీకి సంబంధించిన స్వచ్ఛంద సంస్థ ఒకటి టీం ఇండియాకు డిన్నర్ ఏర్పాటు చేసింది. టీం ఇండియా క్రికెటర్లు అందరు హాజరయ్యారు. వారందరికీ సడన్ ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చాడు విజయ్ మాల్యా. దీంతో ముందు జాగ్రత్తగా ఎలాంటి వివాదాస్పదం కాకుడదనే ఉద్దేశంతో మాల్యాను వారు దూరం పెట్టారు. ఏ ఒక్కరూ కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయలేదని తెలిసింది. అంతేకాదు, ఆ డిన్నర్‌ కార్యక్రమాన్ని కూడా వారు త్వరత్వరగా పూర్తి చేసుకొని వెళ్లిపోయారు.

ఆదివారం ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌కు భారత్‌లో పలు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన విజయ్‌మాల్యా కూడా వచ్చాడు. గత కొంత కాలంగా అతడిని తిరిగి భారత్‌కు రప్పించి రుణాలు మొత్తం వసూలు చేయాలనుకుంటున్న భారత్‌కు మాల్యా పెద్ద తలనొప్పిగా మారాడు. అలాంటి మాల్యా తాము వెళ్లిన ఓ డిన్నర్‌కు హాజరవడంతో షాకయ్యారు. దీనిపై బీసీసీఐ వర్గాలు స్పష్టతనిస్తూ ‘చూడండి.. విరాట్‌గానీ, ఆయన ఫౌండేషన్‌గానీ మాల్యాను ఆ కార్యక్రమానికి పిలవలేదు. సాధారణంగా చారిటీ డిన్నర్‌ అంటే ఎవరైనే ఇష్టపూర్తిగా వచ్చి టేబుల్‌ను కొనుక్కొని తనకు నచ్చినవారిని ఆహ్వానించుకునే అవకాశం ఉంటుంది. అలాగే, ఎవరు ఆ టేబుల్‌ను కొనుక్కున్నారో బహుశా వారే అతడిని పిలిచి ఉంటారు.

Comments

comments

Share this post

scroll to top