చ‌నిపోయార‌నుకున్న పిల్ల‌లు బ‌తికార‌ని తెలిసి చూసేందుకు వెళ్లిన తండ్రి. ఈ ఫొటోలు చూస్తే భావోద్వేగానికి లోన‌వుతారు..!

అనుకోకుండా వ‌చ్చిన యుద్ధం. ఎక్క‌డ చూసినా ఆకాశం నుంచి ప‌డుతున్న బాంబులు. ఆ పేలుళ్ల‌కు తునాతున‌క‌ల‌వుతున్న శ‌రీరాలు. పేరుకుపోతున్న మృత‌దేహాల గుట్ట‌లు. అప్పుడే ఒక బాంబు పడింది. దాని దెబ్బ‌కు ఓ చిన్నారి అసువులు బాసింది. ఆ హృద‌య విదార‌క సంఘ‌ట‌న‌ను చూసిన తండ్రికి దుఃఖం ఆగలేదు. అక్క‌డే ఉంటే ప్ర‌మాదం అని చెప్పి మిగిలిన పిల్ల‌ల‌ను తీసుకుని అక్క‌డి నుంచి దూరంగా వెళ్తున్నాడు. అంతలోనే మ‌ళ్లీ బాంబుల వ‌ర్షం. ఆ దాడిలో జ‌రిగిన ఆందోళ‌న‌లో తండ్రి త‌న పిల్ల‌ల‌కు దూర‌మ‌య్యాడు. వారు ఏమ‌య్యారో తెలియ‌దు. అలా ఏడాది గ‌డిచింది. మ‌రో ప్రాంతానికి శ‌ర‌ణార్థిగా వెళ్లాడు. అక్క‌డే క‌నిపించిన త‌న పిల్ల‌ల‌ను చూసి భావోద్వేగానికి లోన‌య్యాడు.

అత‌ని పేరు అమ్మార్ హ‌మ్మాషో. సిరియా వాసి. అక్క‌డి ఇద్‌లిబ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. స‌రిగ్గా ఏడాది కింద‌ట అక్క‌డ జ‌రిగిన అంత‌ర్యుద్ధం కార‌ణంగా త‌న పిల్ల‌ల్లో ఒక‌ర్ని కోల్పోయాడు. అయితే ఆ స‌మ‌యంలో అమ్మార్ త‌న పిల్ల‌ల‌కు అనుకోకుండా దూర‌మ‌య్యాడు. అయితే ఆ పిల్ల‌ల‌ను అక్క‌డి అధికారులు సైప్ర‌స్ దేశానికి త‌ర‌లించారు. అక్క‌డి Kokkinotrimithia అనే ప్రాంతానికి శ‌ర‌ణార్థులుగా వారిని త‌ర‌లించారు. కానీ ఈ విషయం అమ్మార్‌కు తెలియ‌దు. ఈ క్ర‌మంలోనే ఏడాది గడిచింది. త‌న పిల్ల‌లు ఏమై పోయారో, అస‌లు ఉన్నారో లేదో తెలియ‌ని అయోమ‌య స్థితికి అత‌ను చేరుకున్నాడు.

అయితే అత‌ను కూడా సైప్ర‌స్ ప్రాంతానికి బోటులో వ‌ల‌స వ‌చ్చాడు. అధికారుల ద్వారా స‌మాచారం తెలుసుకున్న అత‌ను త‌న పిల్ల‌లు బ‌తికే ఉన్నారని తెలుసుకుని వారిని క‌లిసేందుకు వ‌చ్చాడు. చివ‌ర‌కు ఎలాగో పిల్ల‌ల‌ను క‌లిసి త‌నివితీరా చూసుకున్నాడు. ఫెన్సింగ్ దాటి లోప‌లికి వెళ్ల‌క‌ముందే ఫెన్సింగ్ లో నుంచే త‌న పిల్ల‌ల‌ను ముద్దాడి ఆత్మీయంగా ప‌ల‌క‌రించాడు. అనంత‌రం భావోద్వేగానికి గుర‌య్యాడు. ఆ సంద‌ర్భంలో తీసిన ఫొటోలు ఇప్పుడు నెట్‌లో వైర‌ల్ అవుతున్నాయి. నిజంగా ఇలాంటి దృశ్యాలు చాలా అపురూపం. చ‌నిపోయార‌నుకున్న వారు క‌న‌బ‌డితే అప్పుడు కలిగే భావాన్ని నిజంగా మాటల్లో చెప్ప‌లేం..! అలాంటి భావాన్నే అమ్మార్ పొందాడు..!

Comments

comments

Share this post

scroll to top