ఫిజిక్స్ స్పెల్లింగ్ రాయలేని వాడికి ఫిజిక్స్ లో 60 కి 60 మార్కులా?

ఈ ఫోటో మన కార్పోరేట్ కాలేజీల వికృత పోకడలకు నిలువెత్తు సాక్ష్యం.  వారి ఆకర్షణ మంత్రం ఎలా ఉంటుందో తెలిపడానికి  ఫర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.  ఫిజిక్స్ స్పెల్లింగ్ కూడా సరిగ్గా రాయలేని ఓ విద్యార్థికి  60 మార్కులకు గానే 60 మార్కులు వేసిన ఘనత ఆ కార్పోరేట్ కాలేజీలది. ఫస్ట్ ఈ ఫోటో గురించి కాస్త మాట్లాడుకొని తర్వాత మన వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. మార్కులే ప్రతిభకు కొలమానమైన చోట, వాటి ఆధారంగానే లక్షలు కొల్లగొట్టాలన్న లక్ష్యం తో దిగినవే కార్పోరేట్ కాలేజీలు… ఆ కళాశాల్లో చదువు ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ ఫోటో ఓ చిన్న ఉదాహరణ మాత్రమే.

Physics  సబ్జెక్ట్ ను phiscs అని రాసిన ఓ విద్యార్థికి 60/60 మార్కులు వేశారు. బై కి బై మార్కులు తెచ్చుకునేంత తోపైన విద్యార్థి Physics అనే పదానికి స్పెల్లింగ్ రాయకపోవడం అతని లోపం  అనాలా? లేక PHYSICS అనే పదానికి స్పెల్లింగ్ రాయలేని విద్యార్థికి 60/60 మార్కులేయడం  ఆ కాలేజ్ లోపం అనాలా?

chaitanaya

వాస్తవానికి ఇది విద్యాలయాల్లోకి పాకిన విష సంస్కృతి, తమ కాలేజ్ లో చదివే ప్రతి విద్యార్థిని టాపర్ గా చూపించి చేసుకునే ప్రచారం .ఇప్పుడు కాస్త మన పిల్లలు చదివే కాన్వెంట్ ల వైపు తొంగి చూద్దాం. తరగతి ఉండేది 30 మంది పిల్లలైతే అందులో 20 మంది పిల్లలకు ఫస్ట్ ర్యాంక్ లిస్తాయి మన ప్రైవేట్ స్కూల్స్. అదెలా సాధ్యం అంటే మీ పిల్లలకు మంచి మార్కులేసి, యాజమాన్యాలు  తల్లీదండ్రుల దగ్గర మంచి మార్కులు కొట్టేస్తున్నాయన్న మాట.

అయినా మనకు కావాల్సింది మార్కులు, పట్టాలే కదా.!  చదవు మనకెందుకులే అని సైలెంట్ గా ఉన్నంత కాలం మన విద్యా వ్యవస్థ ఇలాగే ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మీరేమంటారు.

 

chaitanaya

Comments

comments

Share this post

scroll to top