ఫొటోలు తీసేశానన్నాడు…కానీ.! చివరకు ఎం అయిందో తెలుసా..?

స్రవంతి హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో హొటల్‌మేనేజిమెంట్‌ పూర్తి చేసింది. అక్కడ చదువుతున్నప్పుడే పరిచయం అయ్యాడు అతను. పేరు రాజు. ప్రేమించానంటూ వెనక తిరిగేవాడు. మొదట్లో ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ అతడు వదిలిపెట్టలేదు. పదే పదే తన ప్రేమను వ్యక్తం చేసేవాడు. కొన్నాళ్లకి ఆమె అతడి ప్రేమని ఒప్పుకుంది. అది చనువుకు దారితీసింది. దాంతో ఇద్దరూ తమకు సంబంధించిన వ్యక్తిగత చిత్రాలను వాట్సప్‌లో పంచుకున్నారు. అయితే వారి బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. అతడిలోని మరో రూపం ఆమెకు తెలియడంతో దూరంగా ఉండటం మొదలుపెట్టింది.

కానీ అతడు వదల్లేదు. పెళ్లి చేసుకోమంటూ బలవంతం చేయడం మొదలుపెట్టాడు. ఒప్పుకోకపోతే తన దగ్గర ఉన్న స్రవంతి చిత్రాలను ఆమె బంధువులకూ, సన్నిహితులకు పంపిస్తానని బెదిరించాడు. అయినా ఆమె లెక్కచేయలేదు. అవన్నీ కేవలం బెదిరింపులే అనుకుంది. కానీ ఓ రోజు అతను చెప్పినట్లే చేశాడు. ఆ ఫొటోలను పోర్న్‌ వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేశాడు. వాటి లింక్‌లని స్నేహితులకీ, ఆమె బంధువులకీ కూడా పంపాడు. ఈ విషయం ఆ నోటా, ఈనోటా ఆమెకూ, ఆమె తల్లిదండ్రులకు తెలిసింది. కూతురి నుంచి మరిన్ని వివరాలు తెలిశాక స్రవంతి తల్లి అతడికి ఫోన్‌ చేసింది. వాటిని తొలగించమని అడిగింది. లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేసానని భయపెట్టింది. ఏమనుకున్నాడో ఏమో కానీ వాటిని తొలగించడానికి ఒప్పుకున్నాడు. అక్కడితో సమస్య తీరిపోయిందనుకుని ఊపిరి పీల్చుకుంటే…

ఫొటోలు తొలగించినా ఆ లింక్‌లు ఓపెన్‌ అవుతున్నాయని తెలిసింది. అప్పుడే పోలీసుల్ని సంప్రదించింది స్రవంతి తల్లి. వాటిని ఎలా అయినా తీయించి, అతడికి శిక్షపడేలా చేయమని వేడుకుంది. వెంటనే మా బృందం రంగంలోకి దిగింది. పోర్న్‌ సైట్‌లు ఎవరు నిర్వహిస్తారో తెలియదు. అవి ఐపీలూ ఓ పట్టాన దొరకవు. కానీ ఓ ఆడపిల్లని కాపాడటమే మా లక్ష్యం అనుకున్నాం. చివరికి సైబర్‌ నిపుణుల పర్వవేక్షణలో కొన్ని పోర్న్‌సైట్ల గురించి తెలిశాయి. అలా ఆమె ఫొటోలు పెట్టిన పోర్న్‌సైట్‌లో లింక్‌లు తీయించగలిగాం. అతడిని అరెస్ట్‌ చేసి కోర్టులో నిలబెట్టాం.
ఇలాంటి పరిస్థితి తమ కూతురికే కాదు..మరే ఆడపిల్లకీ జరగకూడదనుకుంది,

Comments

comments

Share this post

scroll to top