చెట్టెక్కి తలకిందులుగా ఆ దంపతుల ఫోటో తీసాడు..! చివరికి ఫోటో ఎలా వచ్చిందో తెలుసా.?

‘జీవితంలో మరుపురాని గుర్తులంటే పెళ్లి ఫొటోలే కదండి! అందుకే వాటిని మరికాస్త వినూత్నంగా తియ్యాలనుకుంటాను. ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌గా కొత్త తరహాలో ఆలోచించక తప్పదుమరి!’’ అంటున్నాడు 23 ఏళ్ల విష్ణు. చెట్టు పైకెక్కి తలకిందులుగా వేలాడుతూ ఫొటోలు తీసిన ఆ వీడియో ఏ రేంజ్‌లో వైరల్‌ అయిందో మీరంతా చూసే ఉంటారు. విచిత్ర విన్యాసాలు చేస్తూ అతను తీసిన తలకిందులు ఫొటో.. ఇప్పుడతని తలరాతను మార్చేసింది. సోషల్‌ మీడియా పుణ్యమాని ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయిపోయిన విష్ణుకు ఇప్పుడు ఆఫర్లమీద ఆఫర్లు వచ్చిపడుతున్నాయట!

సరదాగా తీసిన వీడియో: విష్ణు స్వస్థలం కేరళలోని త్రిసూర్‌. ‘వైట్‌ర్యాంప్‌’ అనే వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్స్‌ గ్రూప్‌లో సభ్యుడు. ఏప్రిల్‌ 15న త్రిసూర్‌కే చెందిన ‘షియాజ్‌-నవ్య’ల పెళ్లిని కవర్‌ చెయ్యడానికి వెళ్లాడు. కొత్త తరహాలో ఫొటోలు తీస్తానంటూ కొత్త జంటను కన్విన్స్‌ చేయడం, చెట్టుకొమ్మకు తలకిందులుగా వేలాడుతూ ఫొటోలు తీయడం.. అలా విష్ణు చేసిన విచిత్ర విన్యాసాలను వాళ్ల గ్రూప్‌ మెంబర్‌ ఒకరు షూట్‌ చేశారు. సరదాగా తీసిన ఆ వీడియోను త్రిసూర్‌ ఫొటోగ్రాఫర్స్‌ వాట్సప్‌ గ్రూప్‌లో అప్‌లోడ్‌ చేశారు. విపరీతంగా నవ్వుపుట్టించే ఆ వీడియో గంటల్లోనే వైరల్‌ అయింది. దాదాపు అన్ని సైట్లూ, పత్రికలూ ఫొటోగ్రాఫర్‌ విచిత్ర విన్యాసం గురించి వార్తలు రాశాయి.

విష్ణు ది వివ్వల్‌ ఫొటోగ్రాఫర్‌: ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్‌ అయిపోయిన విష్ణును త్రిసూర్‌ వాసులంతా ముద్దుగా ‘వివ్వల్‌(గబ్బిలం) ఫొటోగ్రాఫర్‌’ అని పిలుచుకుంటున్నారట. ఫొటోలు బాగా రావడంతో షియాజ్‌-నవ్యలు కూడా ఫుల్‌ఖుష్‌. పైసా ప్రచారం ఖర్చు లేకుండా ఫేమస్‌ అయిపోయిన విష్ణు అండ్‌ గ్రూప్‌కి ఇప్పుడు ఆఫర్లమీద ఆఫర్లు వస్తున్నాయట. ‘‘నిజానికి ఇంతకు ముందు కూడా నేను చెట్లెక్కి ఫొటోలు తీశాను. చిన్నప్పుడు కోతికొమ్మచ్చి బాగా ఆడేవాణ్ని. ఆ ఎక్స్‌పీరియన్స్‌ బాగా కలిసొచ్చింది..’ అని నవ్వేస్తాడు విష్ణు.

വവ്വാൽ ഫോട്ടോഗ്രാഫിക്ക് തുടക്കം ഇട്ടത് ആരെന്ന് ചോദിച്ചാൽ അത് ഒരു #വാടാനപ്പള്ളികാരൻ ആണെന്ന് പറഞ്ഞേക്ക്Vishnu Whiteramp 😂😂

Posted by Adhil Manchester on Wednesday, 18 April 2018

Comments

comments

Share this post

scroll to top