రీల్ “అనసూయ”ను ఫాలో అయిన రియల్ “అనసూయ”..! “సమంత” బికినీ ఫోటో వెనక పెద్ద ట్విస్ట్..!

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత కాబోయే భర్త నాగచైతన్యతో కలిసి ఇటీవలే వెకేషన్‌ కోసం యూరప్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ తను ఎంజాయ్‌ చేస్తున్న ఫోటోలను కూడా సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసింది సమంత. అందులో స్విమ్మింగ్‌ఫూల్‌లో సమంత దిగిన ఫోటో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది.

తాజాగా సమంతను ఫాలో అవుతూ బుల్లితెర హాట్‌ యాంకర్‌ అనసూయ కూడా అలాంటి ఫోటోనే సోషల్‌ మీడియాలో పెట్టింది. అనసూయ ప్రస్తుతం తన భర్తతో కలిసి ఉదయ్‌పూర్‌కు వెకేషన్‌కు వెళ్లింది. అక్కడ ఓ స్విమ్మింగ్‌పూల్‌లో సేదతీరుతూ ఉన్న ఈ ఫోటోను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసింది. ఈ ఫోటోను చూసిన వారందరూ ‘రీల్‌ అనసూయ (అఆలో సమంత పేరు).. రియల్‌ అనసూయ ఒకేలాంటి ఫోటోను షేర్‌ చేశార’ని కామెంట్‌ చేస్తున్నారు.

రీసెంట్‌గా బికినీ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సమంత, తన బ్యాంకాక్ టూర్ కు సంబంధించిన ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకోవటానికి ఏ మాత్రం మొహమాటం పడటంలేదు. త్వరలోనే మళ్లీ హైదరాబాద్ వచ్చి షూటింగ్ పాల్గొనేందుకు సిద్ధమవుతున్న సమంత, తనకు కాబోయే భర్త టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్యతో బ్యాంకాక్ టూర్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోందట. ఇదిలా ఉంటే సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలకు సంబంధించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఆమె ఫొటోలన్నీ హీరో నాగ చైతన్య తీసినవేనని టాక్. నిజానికి నాగచైతన్యలో ఈ రేంజ్‌లో ఫొటోలు తీసే స్కిల్స్ ఉన్నాయనే విషయం ఇంతకాలం ఎవరికీ తెలియదు. సమంత కోసం వంట కూడా నేర్చుకున్నానని, వంట చేస్తున్న ఫొటోలను పోస్ట్ చేసి మరీ చెప్పాడు ఈ యంగ్ హీరో. ఇక ఇప్పుడు తనకు కాబోయే శ్రీమతికి సంబంధించిన ఫొటోలను తానే క్లిక్ కొడుతున్నాడట చైతూ. తనదైన ఫొటోగ్రఫీతో సమంత అందాలను మరింత అందంగా కెమెరాల్లో దాచేందుకు ప్రయత్నిస్తున్నాడు అక్కినేని యంగ్ హీరో. ప్రస్తుతానికి కొన్ని ఫొటోలను మాత్రమే.. సమంత తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేస్తున్నా.. వీరి బ్యాంకాక్ టూర్ ముగిసేలోపు చైతూ ఫొటోగ్రఫీ నుంచి పుట్టుకొచ్చిన మరిన్ని ఫొటోలు బయటకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. సో, హీరో ఇజం ప్రదర్శంచడమే కాదు ఫొటోగ్రఫర్‌గానూ ప్రొఫెషనలిజాన్ని ప్రదర్శిస్తున్నాడనమాట అక్కినేని వారి అబ్బాయి.

 

 

 

 

 

Comments

comments

Share this post

scroll to top