Photo Of The Day….. అమ్మో…అమ్మ.

ఇది ఈనాడు పత్రికలో ప్రచురితమైన ఫోటో…తన పిల్లల భవిష్యత్ కోసం ఓ తల్లి ఎంతగా ఆరాటపడుతుందో, ఎన్ని కష్టాలను సహనంతో భరిస్తుందో తెలిపే చిత్రమిది. హైద్రాబాద్ లో కురిసిన వర్షానికి రోడ్లు చిత్తడిగా మారడంతో స్కూల్ నుండి తన పిల్లలను ఇంటికి తీసుకువస్తున్న ఓ మహిళ తన పిల్లలతో సహా స్కూటీ మీది నుండి కింద పడింది. నేటి తరం తల్లులు తమ పిల్లల భవిష్యత్ కోసం ఎంతలా కష్టడుతున్నారు అనే విషయంతో పాటు…మహానగరం లోని రోడ్ల దుస్థితిని కళ్లకు కట్టిన ఈ ఫోటోను తీసిన ఫోటోగ్రాఫర్ కి అభినందనలు తెలపాలి.

తల్లులు జర జాగ్రత్త…..!

amma1

 తల్లిప్రేమపై…………

తల్లి ప్రేమ ఎంత “మధురం ”
అది ఆస్వాదించిన కొద్దీ “అమృతం”
కాదోయ్ ఎప్పటికి కూడా ” గరళం”
తల్లి ఒడి వెలకట్టలేని ” అక్షయం”
అది జగతిలో సాటిలేని ” కిశోరం”
చేయకు దానిని ” వ్యర్థం”
కొవొత్తిలా కరుగుతూ అమ్మ  పంచె ప్రేమ..
ఏమిచ్చి కొనగలవ్ ఈ జగతిలోన….
మరి తెలుసుకొని ఆ మనసు బాధపెట్టకు ఇక నైనా….

కవిత: ( అరవింద్ )

amma2

Photo: Eenadu.

 

Comments

comments

Share this post

scroll to top