ఇకపై మీ ఫోన్ పోతే బాధపడక్కర్లేదు…సింపుల్ గా తిరిగిపొందాలంటే ఏం చేయాలో తెలుసా..?

స్మార్ట్‌ఫోన్లు అనేవి నేటి త‌రుణంలో చాలా మంది చేతుల్లో కామ‌న్ అయిపోయాయి. చాలా త‌క్కువ ధ‌ర‌కే ఇవి ల‌భిస్తున్నాయి. ఇక వినియోగ‌దారుల అభిరుచుల‌కు అనుగుణంగా ఖ‌రీదైన ఫోన్లు కూడా ల‌భిస్తున్నాయనుకోండి. అది వేరే విషయం. కానీ ఎవ‌రైనా త‌మ బ‌డ్జెట్‌కు అనుగుణంగానే ఫోన్‌ను కొనుగోలు చేస్తారు. అయితే ఎంత బ‌డ్జెట్ పెట్టి ఫోన్ కొన్నా అది మ‌న‌కు ముఖ్య వ‌స్తువే క‌దా. అది పోతే అంతే సంగ‌తులు. మ‌నకు అస్స‌లు మ‌న‌సుకు ప‌ట్ట‌దు. అయ్యో.. నా ఫోన్ పోయిందే అన్న విష‌య‌మే ప‌దే ప‌దే గుర్తుకు వ‌స్తుంది. అయితే ఇక‌పై మీకు ఈ బెంగ ఉండ‌దు. మీరు ఫోన్‌ను పోగొట్టుకున్నా మీకు అది దొరుకుతుంది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అయితే ఇది ఎలా సాధ్య‌మ‌వుతుందో తెలుసా..?

ఏమీ లేదండీ.. ఇక‌పై మీరు ఎప్పుడైనా ఫోన్‌ను పోగొట్టుకుంటే వెంట‌నే స‌మీపంలో ఉన్న పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి అక్క‌డ మీ ఫోన్ ఐఎంఈఐ నంబ‌ర్ చెప్పండి చాలు. దాంతో ఆ నంబ‌ర్ ఆధారంగా మీ ఫోన్‌ను ఎవ‌రు వాడుతున్నారు, ఏ సిమ్‌ను ఉపయోగిస్తున్నారు, వారు ఎక్క‌డ ఉన్నారు అనే విష‌యాల‌ను పోలీసులు సుల‌భంగా ట్రాక్ చేస్తారు. దీంతో మీ ఫోన్ మ‌ళ్లీ మీకు దొరుకుతుంది. ఏంటీ.. న‌మ్మ‌శ‌క్యంగా లేదా. అయినా ఇది నిజ‌మే. ఇదే విష‌యంపై మ‌న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తాజాగా జ‌రిగిన పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల్లో ప్ర‌క‌ట‌న చేశారు. అదేమిటంటే…

బ‌డ్జెట్ స‌మావేశాల్లో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ స్మార్ట్‌ఫోన్ల‌ను కోల్పోవ‌డం అనేది వ్య‌క్తిగ‌త న‌ష్ట‌మే కాద‌ని, అది దేశ భ‌ద్ర‌త‌కు సంబంధించిన ముప్పు అని అన్నారు. దేశంలో ఎవరైనా ఫోన్‌ను పోగొట్టుకుంటే దాన్ని తిరిగి తెచ్చించేందుకు ఉపయోగ‌ప‌డే సెంట్ర‌ల్ ఎక్విప్‌మెంట్స్ ఐడెంటిఫై రిజిస్ట‌ర్ (సీఈఐఆర్‌) పేరిట కొత్త టెక్నాల‌జీ తెస్తున్నామ‌ని అన్నారు. ఇందుకు బ‌డ్జెట్‌లో రూ.15 కోట్లు కేటాయించిన‌ట్టు తెలిపారు. ఈ టెక్నాల‌జీని పోలీసులు ఉప‌యోగించుకుని ప్ర‌జ‌లు ఇచ్చే ఫోన్ ఐఎంఈఐ నంబ‌ర్ల ద్వారా వారి ఫోన్ల‌ను ట్రాక్ చేసి దొంగిలించబ‌డిన ఫోన్ల‌ను అప్ప‌గిస్తారని అన్నారు. ఇప్ప‌టికే ఈ విధానం అందుబాటులో ఉన్నా దీనికి స‌రైన విధి విధానాలు లేనందున పోలీసులు క‌న్‌ఫ్యూజ్ అవుతున్నార‌ని, కనుక ఈ టెక్నాల‌జీని ప్ర‌వేశ‌పెడుతున్నామ‌ని అరుణ్ జైట్లీ చెప్పారు. అయితే ఇది ఎప్ప‌టి నుంచి అందుబాటులోకి వ‌స్తుందో తెలియ‌దు కానీ ఈ విధానం వ‌స్తే మాత్రం ఎంతో బాగుంటుంది క‌దా. ఫోన్ పోయినా దిగులు చెందాల్సిన ప‌ని ఉండ‌దు..!

Comments

comments

Share this post

scroll to top