వాట్సాప్‌లో అందుబాటులోకి వ‌చ్చిన మ‌రో ఫీచ‌ర్‌.. అది మారిస్తే ఆ విష‌యం ఇత‌రుల‌కు చెప్ప‌డం ఇక ఈజీ..!

ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధిక మంది యూజ‌ర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ల‌లో మొద‌టి స్థానంలో ఉంది. అందుకు కార‌ణం అందులో ఎప్ప‌టిక‌ప్పుడు యూజ‌ర్ల‌కు ల‌భించే ఫీచ‌ర్లే. ఇత‌ర ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ల‌కు దీటుగా ఫీచ‌ర్ల‌ను యూజ‌ర్ల‌కు అందివ్వ‌డంలోనూ వాట్సాప్ ముందుంది. దీంతో వాట్సాప్‌ను వాడే యూజ‌ర్లు ఎప్ప‌టిక‌ప్పుడు పెరుగుతూనే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే వాట్సాప్ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను ప్ర‌వేశ‌పెడుతూ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటూ వ‌స్తోంది. అందులో భాగంగానే తాజాగా ఛేంజ్ నంబ‌ర్ అనే మ‌రో ఫీచ‌ర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది.

సాధార‌ణంగా మ‌నం ఫోన్ నంబ‌ర్ ను మార్చినప్పుడ‌ల్లా ఆ మారిన నంబ‌ర్‌ను మ‌న కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న అంద‌రికీ ఫోన్ చేసి చెబుతూ ఉంటాం. నిజానికి అది చాలా ప్ర‌యాస‌తో కూడిన‌ది. అంత మంది కాల్ చేసి ఫోన్ నంబ‌ర్ మార్చాం అని చెప్ప‌డం చాలా క‌ష్టంతో కూడుకున్న ప‌ని. అయితే అలాంటి యూజ‌ర్ల పనిని ఇప్పుడు వాట్సాప్ మ‌రింత తేలిక చేసింది. ఎలా అంటే.. మీరు ఉదాహ‌ర‌ణ‌కు ఫోన్ నంబ‌ర్‌ను మార్చార‌నుకోండి. సింపుల్‌గా వాట్సాప్‌లో ఉండే సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్ అనే విభాగంలో ఉండే చేంజ్ నంబ‌ర్ అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. అనంత‌రం అందులో వ‌చ్చే ఆప్ష‌న్ల‌లో పాత‌, కొత్త ఫోన్ నంబ‌ర్ల‌ను ఎంట‌ర్ చేసి స‌బ్‌మిట్ నొక్కాలి. దీంతో వాట్సాప్‌లో ఉన్న మీ కాంటాక్ట్ లిస్ట్ అంద‌రికీ మీ నంబ‌ర్ మారింద‌నే మెసేజ్ క్ష‌ణాల్లో వెళ్లిపోతుంది.

అయితే వాట్సాప్‌లో కేవ‌లం కొంద‌రికే మీ నంబ‌ర్ మార్చిన విష‌యం చెప్పాలంటే అందుకు కూడా స‌ద‌రు విభాగంలో ఆప్ష‌న్ ను ఏర్పాటు చేశారు. ఆ ఆప్ష‌న్‌తో మీ ఫోన్ నంబ‌ర్ మారింద‌ని కేవ‌లం కొంద‌రికే చెప్ప‌వచ్చు. మీకు కావ‌ల్సిన వారికి మాత్ర‌మే మీ ఫోన్ నంబ‌ర్ మారింద‌నే విష‌యం ఈ ఆప్ష‌న్ ద్వారా తెలుస్తుంది. ఇక కొత్త‌గా మార్చిన ఫోన్ నంబ‌ర్‌కు కాంటాక్ట్స్‌ను, చాట్ హిస్ట‌రీ, ఇత‌ర డేటాను ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకునే స‌దుపాయం కూడా వాట్సాప్ క‌ల్పించింది. అయితే ఈ ఫీచ‌ర్ల‌న్నీ ప్రస్తుతం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల‌లో వాట్సాప్ బీటా వెర్ష‌న్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు మాత్ర‌మే అందుబాటులోకి వ‌చ్చాయి. త్వ‌ర‌లో పూర్తిస్థాయిలో ఆండ్రాయిడ్‌, ఐఓఎస్, విండోస్ ఫోన్ యూజ‌ర్ల‌కు ఈ ఫీచ‌ర్లు ల‌భిస్తాయి. ఆండ్రాయిడ్‌లో వాట్సాప్ బీటా వెర్ష‌న్‌ను వాడుతున్న వారు గూగుల్‌ ప్లే స్టోర్‌లోని 2.18.97 వెర్ష‌న్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే ఈ ఫీచ‌ర్లు పొంద‌వ‌చ్చు.

Comments

comments

Share this post

scroll to top