ఫోన్ లాక్ పిన్/పాటర్న్ మర్చిపోయారా.? అయితే ఇలా సింపుల్ గా “UNLOCK” చేయొచ్చు తెలుసా.? ట్రై చేయండి!

చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడం ఎంత సహజమో,ఆ స్మార్ట్ ఫోన్ కి లాక్ పెట్టుకోవడం కూడా అంతే సహజం..అది కొందరు కొన్ని అవసరాల రిత్యా ,మరికొందరు సెక్యురిటి రిత్యా మన స్మార్ట్ ఫోన్ కి లాక్ పెట్టుకుంటాం.డెయిలి యూజ్ చేసే మొబైలే అయినప్పటికి అప్పుడప్పుడు సహజంగా మన ఫోన్ లాక్ ప్యాట్రన్ మరిచిపోతుంటాం.ఒక్కోసారి కొన్ని ప్రయత్నాల తర్వాత అన్ లాక్ అవుతుంది కానీ ,కొన్ని సార్లు ఎంత ప్రయత్నించిన ఆ ప్యాట్రన్ ఏంటో గుర్తు రాదు..అప్పుడు ఫోన్ అన్ లాక్ చేయడానికి ఒకటే దారి అని మోబైల్ షాప్ కి తీసుకెళ్తాం అలా కాకుండా మోబైల్ అన్ లాక్ చేసుకునే పద్దతి తెలుసుకుంటే ఈ సారి సింపుల్ గా మర్చిపోయిన మన అన్ లాక్ ప్యాట్రన్ గుర్తు రాకపోయిన ఈజీగా లాక్ తీసేయోచ్చు అవేంటో తెలుసా…?

ప్యాట్రన్‌, పిన్‌ లాక్‌లను రీసెట్‌ చెయ్యడానికి వండర్‌షేర్‌ ఆండ్రాయిడ్‌ ప్యాట్రన్‌ లాక్‌ రిమూవ్‌ అని ఓ సాఫ్ట్‌వేర్‌ లభిస్తుంది. కాకపోతే ఇది పెయిడ్‌ సాఫ్ట్‌వేర్‌. దీన్ని కంప్యూటర్లోకి డౌన్‌లోడ్‌ చేసుకుని, మీ ఫోన్‌ను ఆ పిసికి కనెక్ట్‌ చేసి స్ర్కీన్‌ మీద కన్పించే ఆదేశాలకు తగ్గట్లు చేస్తే ప్యాట్రన్‌ లాక్‌ తొలగించబడుతుంది.
ఈ సాప్ట్ వేర్ వలన ఫోన్ ఓపెన్ అవ్వకపోతే దానికి ఇంకొకటే మార్గం ఉంది..అదే ఫోన్ ని రీసెట్ చేయడం అదెలాగంటే… ఫోన్‌ మీద ఉండే వాల్యూమ్‌, హోమ్‌, పవర్‌ బటన్లను ఒకేసారి ప్రెస్‌ చెయ్యడం ద్వారా రికవరీ మోడ్‌లోకి వెళ్లి ఫ్యాక్టరీ రీసెట్‌ చేయమని అడుగుంది… అయితే ఇలా ఫ్యాక్టరీ రీసెట్‌ చేసేటప్పుడు ఫోన్‌లోని ఇంటర్నల్‌ స్టోరేజ్‌లోని డేటా మొత్తం పోతుంది, మెమరీ కార్డ్‌లో డేటాకు ఎలాంటి ప్రమాదం లేదు.కాబట్టి ఈ రెండు ట్రిక్స్ తో ఇకపై ప్యాట్రన్ మర్చిపోతే సింపుల్ గా అన్ లాక్ చేసుకోండి..

Comments

comments

Share this post

scroll to top