ఫోన్ లో ప్రియుడితో లైవ్ వీడియో కాల్‌లో మాట్లాడుతూనే ఆ యువ‌తి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. అసలేమైంది.?

నేటి త‌రుణంలో కాలేజీల్లో చ‌దివే యువ‌తీ యువ‌కులు అన్నాక ల‌వ్‌లో ప‌డ‌డం కామ‌న్ అయిపోయింది. ఇక న‌గ‌రాల్లోని కాలేజీల్లో చ‌దివే యువ‌త అయితే ఇందులో అంద‌రిక‌న్నా కొంత ముందే ఉంటున్నారు. ప్రేమ‌లో ప‌డ‌డ‌మే కాదు, ఆ ప్రేమ విఫ‌లం అయినా, లేదా మ‌రేదైనా కార‌ణం ఉన్నా స‌రే ఆత్మ‌హత్య చేసుకుంటున్నారు. త‌మ నిండైన జీవితానికి మ‌ధ్య‌లోనే ఫుల్‌స్టాప్ పెడుతున్నారు. నేటి త‌రుణంలో ఇలాంటి ఆత్మ‌హ‌త్య‌లు మ‌రీ ఎక్కువ‌య్యాయ‌నే చెప్ప‌వ‌చ్చు. తాజాగా హైద‌రాబాద్ న‌గ‌రంలోనూ ఇలాంటి ఓ ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న చోటు చేసుకుంది.

హైద‌రాబాద్‌లోని కొంప‌ల్లిలో ఉన్న శివ‌శివానీ కాలేజీలో హ‌నీషా చౌద‌రి అనే యువ‌తి ఎంబీఏ చ‌దువుతోంది. ఈమెది అనంత‌పురం జిల్లా. ఈమె తండ్రి పేరు బుగ్గ‌య్య చౌద‌రి. ఇక ఈమె త‌మ కాలేజీలోనే చ‌దువుతున్న ద‌క్షిత్ ప‌టేల్ అనే యువ‌కుడిని గ‌త కొంత కాలంగా ప్రేమిస్తోంది. అయితే ఈమెకు స‌మ‌స్య ఉందో తెలియ‌దు కానీ.. తీవ్ర‌మైన మాన‌సిక వేద‌న‌కు లోనైంది. ల‌వ్ ఫెయిలా లేదంటే మ‌రేదైనా విష‌యం ఉందా అనేది తెలియదు. కానీ తాజాగా త‌న ప్రియుడు ద‌క్షిత్ ప‌టేల్‌తో అర్థ‌రాత్రి 2.30 గంట‌ల స‌మ‌యంలో వీడియో కాల్‌లో మాట్లాడుతూ స‌డెన్‌గా ఆత్మ‌హ‌త్య చేసుకుంది.

హ‌నీషా ఓ వైపు ఫోన్‌లో ద‌క్షిత్ ప‌టేల్‌తో వీడియో కాల్ మాట్లాడుతూనే మ‌రో వైపు తాను ఉంటున్న రూమ్ లోప‌లికి వెళ్లింది. దీన్ని మ‌రో వైపు ఉన్న ద‌క్షిత్ చూస్తూనే ఉన్నాడు. ఆమెను వ‌ద్ద‌ని వారించాడు. అయినా ఆమె విన‌లేదు. ఫ్యాన్‌కు ఉరేసుకుని లైవ్ వీడియో కాల్‌లో ఉండ‌గానే ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీంతో ద‌క్షిత్ వెంట‌నే ఆమె ఉంటున్న హాస్ట‌ల్ వ‌ద్ద‌కు వ‌చ్చి ఆమె గ‌ది త‌లుపులు బ‌ద్ద‌లు కొట్టి చూడగా ఆమె మృత‌దేహం ఫ్యాన్‌కు వేలాడుతూ క‌నిపించింది. దీంతో ద‌క్షిత్ హ‌నీషా స్నేహితురాలి స‌హాయంతో ఆమెను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించాడు. అయినా అప్ప‌టికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో స‌మాచారం అందుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. హ‌నీషా తీవ్ర‌మైన డిప్రెష‌న్‌లో ఉంద‌ని, అందుకే ఆత్మ‌హత్య చేసుకుని ఉంటుంద‌ని పోలీసులు భావిస్తున్నారు.

అనంతపురం జిల్లాకు చెందిన జగ్గయ్య చౌదరి, కుమార్తె అనీషా చౌదరి (23) కొంపల్లిలోని శివశివానీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతూ కాలేజీ హాస్టల్‌ లో ఉంటుంది. అదే కాలేజీలో చదువుతున్న మేడ్చల్‌ గ్రామానికి చెందిన దీక్షేశ్‌ పటేల్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇదిలా ఉండగా ఈ నెల 26న జరగనున్న తన స్నేహితుడి పెళ్లికి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ విషయమై ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో 16 నుంచి 17వ తేది అర్ధరాత్రి వరకు చాటింగ్‌ ద్వారా మాటల యుద్దం నడిచింది. రెండు రోజుల వ్యవధిలో 320 కు పైగా మెసెజ్‌లు అనీషాచౌదరి ఫోన్‌లో నిక్షిప్తమై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో మాటా మాటా పెరిగి తననే అనుమానిస్తున్నావా అంటూ .ప్రియుడు దీక్షేశ్‌ కు వీడియో కాల్‌ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్సై వెంకటేశ్‌ అనీషా స్నేహితురాలి లాప్‌ట్యాప్‌తో పాటు అనీషా ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా మెసెజ్‌ల ద్వారా కోపాన్ని ప్రదర్శించినట్లు గుర్తించారు. దీక్షేశ్‌ను విచారించి వదిలేశారు.

ఏది ఏమైనా.. ఎవ‌రూ ఇలా మాత్రం ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌ద్దు. ఏదైనా విష‌యం ఉంటే, స‌మ‌స్య ఎదురైతే ధైర్యంగా పోరాడాలి. ఆత్మ‌హ‌త్య‌తో సాధించేది ఏమీ ఉండ‌ద‌ని తెలుసుకోవాలి..!

Comments

comments

Share this post

scroll to top