ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేసిన ఫోన్ డెలివ‌రీ లేట్ అయింద‌ని.. ఆమె డెలివ‌రీ బాయ్‌ను ఏం చేసిందో తెలుసా.?

నేటి త‌రుణంలో ఈ-కామ‌ర్స్ వెబ్‌సైట్ల‌యిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల‌లో స్మార్ట్‌ఫోన్ల‌ను కొనుగోలు చేయ‌డం ఎక్కువైంది. ఎందుకంటే బ‌య‌టి క‌న్నా ఎన్నో ఎక్కువ మోడ‌ల్స్ ఆన్ లైన్‌లో ల‌భిస్తాయి. దీనికి తోడు ఆఫ‌ర్లు, డిస్కౌంట్ ధ‌ర‌లు ఉంటాయి. క‌నుక‌నే చాలా మంది ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో ఫోన్‌ను కొనేందుకే ఆసక్తిని చూపుతున్నారు. అయితే ఏ ఫోన్‌ను కొన్నా అది త్వ‌ర‌గా డెలివ‌రీ అయితేనే మ‌న‌కు హ్యాపీగా ఉంటుంది. కానీ కొన్ని సార్లు అలా జ‌ర‌గ‌దు క‌దా. మ‌న‌కు డెలివ‌రీ అని చెప్పిన టైంకు ఫోన్ డెలివ‌రీ కాదు. దీంతో ఎవ‌రైనా ఒకింత ఆగ్ర‌హానికి లోన‌వుతారు. అయితే ఢిల్లీకి చెందిన ఓ మ‌హిళ‌కు మాత్రం తాను ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేసిన ఫోన్ డెలివ‌రీ ఆల‌స్యం అయినందుకు ఆమెకు ప‌ట్ట‌రానంత కోపం వ‌చ్చింది. ఎంత‌లా అంటే.. ఆమె ఏకంగా ఫోన్‌ను డెలివ‌రీ ఇవ్వ‌డానికి వ‌చ్చిన బాయ్‌ను క‌త్తితో పొడిచింది. దీంతో ఆ డెలివ‌రీ బాయ్ ఇప్పుడు ఆస్ప‌త్రిలో చావు బ‌తుకుల మ‌ధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

అది ఢిల్లీలోని నిహాల్ విహార్ ఏరియా. అక్క‌డ క‌మ‌ల్ దీప్ (30) అనే మ‌హిళ నివాసం ఉంటోంది. ఈమె ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఇటీవ‌లే రూ.11వేల విలువైన ఓ ఫోన్‌ను బుక్ చేసింది. దీంతో కొత్త ఫోన్‌ను ఎప్పుడెప్పుడు చూడాలా అన్నంత ఆనందంలో ఆమె ఉంది. అయితే ఫోన్ డెలివ‌రీ ఆల‌స్యం అయింది. అందుకు కార‌ణం.. డెలివ‌రీ బాయ్ ఆ ఏరియాకు కొత్త. అత‌నికి అడ్ర‌స్ స‌రిగ్గా తెలియ‌దు. దీంతో ఫోన్ డెలివ‌రీ ఆల‌స్యం చేశాడు. చివ‌ర‌కు ఎలాగో అడ్ర‌స్ వెతికి ప‌ట్టుకుని క‌మ‌ల్ దీప్‌కు ఫోన్‌ను డెలివ‌రీ చేసేందుకు య‌త్నించ‌గా ఆమె ప‌ట్ట‌రానంత కోపంతో ఆ డెలివ‌రీ బాయ్‌పై దాడి చేసింది. వంటింట్లో నుంచి క‌త్తి ప‌ట్టుకుని వ‌చ్చి అత‌న్ని విచ‌క్ష‌ణా ర‌హితంగా పొడిచింది.

అలా క‌మ‌ల్‌దీప్ ఆ డెలివ‌రీ బాయ్‌ను ఏకంగా 20 సార్లు క‌త్తితో పొడిచింది. ఆమె ఆ ప‌ని చేస్తుండ‌గా ఇంట్లో నుంచి ఆమె సోద‌రుడు జితేంద‌ర్ సింగ్ (34) వ‌చ్చి ఆమెతో క‌లిసి ఆ డెలివ‌రీ బాయ్‌ని షూ లేస్‌తో ఉరి బిగించి చంపాల‌ని చూశారు. చివ‌ర‌కు అత‌న్ని చంప‌డం మానుకుని అత‌ని వ‌ద్ద డెలివ‌రీకి సిద్ధంగా ఉన్న తాము ఆర్డ‌ర్ చేసిన ఫోన్‌ను, అత‌ని వ‌ద్ద ఉన్న రూ.40వేల న‌గ‌దును తీసుకుని అతన్ని ఓ వాహనంలో ఎక్కించి చందర్ విహార్ ప్రాంతంలోని ఓ మురికి కాల్వ వద్ద పడేశారు. అక్క‌డ ర‌క్త‌పు మ‌డుగులో కొట్టుమిట్టాడుతున్న ఆ డెలివ‌రీ బాయ్‌ను ఎవ‌రో చూసి పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో వారు ఆ బాయ్ వ‌ద్ద‌కు చేరుకుని అత‌న్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేపట్టారు. ప్ర‌స్తుతం ఆ డెలివ‌రీ బాయ్ ఆస్ప‌త్రిలో చావు బ‌తుకుల మ‌ధ్య కొట్టు మిట్టాడుతున్నాడు. ఏది ఏమైనా.. ఇలాంటి ప‌రిస్థితి ఏ డెలివ‌రీ బాయ్‌కు రాకూడ‌దు..!

Comments

comments

Share this post

scroll to top