సహసమే ఊపిరిగా సాగిపోతున్న యువకుడు. అతడి సాహసకృత్యాల గురించి వింటేనే ఒళ్లు జలదరిస్తుంది.

డ్రిల్ మెషీన్‌ను ఛాతిపై పెట్టి నాలుగు ఇంచులు డ్రిల్ చేసుకుంటాడు, 25 కత్తులు ఒక్కదగ్గర పెట్టి అమాంతం గొంతులోనికి దించుకుంటాడు.వేడి వేడి నూనెలో బజ్జీలు వేసి చేయితో తీస్తాడు. సలసల కాగుతున్న నూనెను నాలుక మీద వేసుకుంటాడు. కళ్లకు గంతలు కట్టుకుని వేగంగా నడుస్తున్న టేబుల్ ఫ్యాన్‌ను నాలుకతో ఆపుతాడు.ముక్కులోకి స్టీల్‌హుక్ దించుకొని ఓల్వో బస్సును లాగుతాడు. ఏంటి వింటుంటేనే ఒళ్లు జలదరిస్తుందా…? వినే మనకే ఇలా ఉంటే మరి చేసే అతనికి ఎలా ఉంటుందో కదా….ఇలాంటి అసాధారణ ప్రతిభతో ప్రపంచ నలుమూలల నుండి అభిమానులను సొంతం చేసుకున్నాడు ఓ పల్లెటూరి మొనగాడి గురించి కాస్తంత క్లియర్ గా తెల్సుకుందాం.

10643429_881275965318482_257154791_n

అతని పేరు క్రాంతి. అతనిది నల్లగొండ జిల్లా మోత్కురు మండలం అడ్డగూడూరు. కూలికి వెళితే కానీ కడుపు నిండని పరిస్థితి కానీ క్రాంతి మనస్సులో మాత్రం ఓ బలమైన కోరిక… అందరి చేత శభాష్ అనిపించుకోవాలి తన ప్రతిభకు సలాం చెప్పించుకోవాలి. దాని కోసం ఏం చేయడానికైనా సిద్దం, ఎంతకు తెగించడానికైనా సిద్దమయ్యాడు క్రాంది…అదిగో సరిగ్గా అదే సమయంలో ఓ రియాలిటీ షో అతని జీవితాన్ని మార్చింది, అతనికో లక్ష్యాన్ని చూపింది. రియాలిటీ షో చూసి క్రాంతి అవాక్కయ్యాడు…ఇలా కూడా చేయొచ్చా.? అని ఆశ్చర్యపోయాడు…..అసలు వీటి వెనుకున్న లాజిక్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశాడు.

12835058_881275958651816_371095393_n-tile
సహాస కృత్యాలను సొంతంగా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాడు. శరీర అవయవాల పనితీరు గురించి తెల్సుకున్నాడు. ఇటు సైన్స్ అటు సాహసాన్ని మిక్స్ చేసి అద్భుతమైన విన్యాసాల్ని ప్రదర్శిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు క్రాంతి.

అడ్డుకున్న అధికారులే సెల్యూట్ చేసిన క్షణం:
క్రాంతికి మలేషియా లో ప్రదర్శన ఇవ్వడానికి ఆఫర్ వచ్చింది. ప్రదర్శన ఇవ్వడానికి వెళ్తుండగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇమిగ్రేషన్ అధికారులు క్రాంతిని పట్టుకున్నారు. బ్యాగులో ఉన్న డ్రిల్ మెషీన్, మేకులు, పసుపు వంటి వస్తువులు తీసుకెళ్లడానికి వీళ్లేదని చెప్పారు. తను రియాలిటీ షోలు చేస్తానని, మలేషియా ఒక కార్యక్రమానికి వెళ్తున్నానని నచ్చజెప్పాడు. అయినా వినకపోవడంతో కాంతి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన మొబైల్‌లో ఉన్న వీడియోలు ఇమిగ్రేషన్ అధికారులకు చూపించాడు. వీడియోలు చూసిన ఇమిగ్రేషన్ అధికారులు అతని అసాధారణ ప్రతిభకు సెల్యూట్ కొట్టి ఫ్లెట్ ఎక్కించారు.

ప్రస్తుతం:
అనుకున్నట్టుగానే అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు, అతడు ఎక్కడ ప్రదర్శనలిచ్చినా చుట్టూ చేరి చప్పట్లు కొట్టే జనాల్ని సంపాదించుకున్నాడు. అయినప్పటికీ ఆర్థికంగా ఇప్పటికీ అష్టకష్టాలు పడుతున్నాడు. అతని సాహసకృత్యాలను చూసి ఔరా అనేవాళ్ళు చాలామందే ఉన్నారు కానీ, అతడిని వెన్నుతట్టి ప్రోత్సాహించే వాళ్లు కానీ, అతడికి ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేసే వాళ్లు  లేరు. ఎవరైనా దాతలు స్పందిస్తే బాగుంటుంది.

fdd

Watch Video:

Comments

comments

Share this post

scroll to top