ఒక్క ట్రైలర్, ఒకే ఒక్క ట్రైలర్ తో సంక్రాంతికి రానున్న సినిమాలను భయపెట్టిన రజినీకాంత్.

పెట్ట ట్రైలర్ చుసిన ప్రతి ఒక్కరి కళ్ళల్లో సంతోషం. తలైవర్ రజినీకాంత్ సినిమా వస్తుంది అంటే జనాలకి పండగే, అలాంటిది అయన సినిమా అంతా స్టైల్ అండ్ గ్రేస్ తో నిండిపోతే ఇంక అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. జనవరి 10 వ తారీఖున తెలుగు, తమిళ్ బాషలలో పెట్టా సినిమా విడుదల కానుంది. ఇవ్వాళ ఈ చిత్ర ట్రైలర్ ని యూట్యూబ్ లో విడుదల చేసారు పెట్టా నిర్మాతలు. అవుట్ అండ్ అవుట్ పక్కా రజినీకాంత్ మాస్ సినిమా అని కచ్చితంగా చెప్పొచ్చు.

పెట్టా సినిమా లో సిమ్రాన్, విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్దికీ, త్రిష, బాబీ సింహ, మేఘ ఆకాష్ నటీ నటులు గా నటించారు. అయితే ఈ సినిమాకు ఆకర్షణ మాత్రం సూపర్ స్టార్ రజినీకాంత్ ఎ. ట్రైలర్ లో అయన స్మైల్ అండ్ స్టైల్ చూస్తుంటే అభిమానులు ఆనందం తో ఉభితబ్బిపైపోతున్నారు. ట్రైలర్ చివర్లో రజినీకాంత్ డాన్స్ స్టెప్స్ వేస్తూ వచ్చే సీన్ అయితే ట్రైలర్ కె హైలైట్. ఇంక ట్రైలర్ చివర్లో అయన నవ్వు చూస్తే మనకు చిన్న పిల్లోడే గుర్తొస్తాడు.

watch petta trailer :

సంక్రాంతి సినిమాలు.. ఇక ప్యాక్ అప్ :

సంక్రాంతి కి తమిళ్ లో పెట్టా తో పాటు అజిత్ కుమార్ నటించిన విశ్వాసం సినిమా కూడా విడుదల కానుంది. రెండు ఒకే రోజు విడుదల కానున్నాయి, ఇక తెలుగు లో ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, రామ్ చరణ్ వినయ విధేయ రామ, వెంకటేష్ F2 చిత్రాలు తెలుగు లో విడుదల కానున్నాయి, పెట్టా సినిమా తెలుగు లో కూడా విడుదల కానుంది. తెలుగు తమిళ్ భాషల్లో జనవరి 10 వ తారీఖున విడుదల కానుంది. అయితే ఈ ట్రైలర్ చుసిన ప్రతి ఒక్కరు, సంక్రాంతి బరి లో ఉన్న తెలుగు, తమిళ్ సినిమాలన్నీ ఇంకా ప్యాక్ అప్ ఎ, ఈ పండగ రజినీకాంత్ దే అని సోషల్ మీడియా అంత హోరెత్తిపోతుంది. సినిమా రిలీజ్ అయ్యాక ఎటువంటి సెన్సేషన్ సృష్టిస్తాడో చూడాలి.

Comments

comments

Share this post

scroll to top