పెట్రోల్ కోసం..ఇండియా నుండి నేపాల్ కు వెళుతున్నారు…ల‌క్ష‌ల్లో సంపాదించుకుంటున్నారు.!

ఇండియాలో పెట్రోల్ రేట్లు భ‌గ్గుమంటున్న త‌రుణంలో….పెట్రోల్ కోసం స‌రిహ‌ద్దు ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ప‌క్క దేశాల‌కు వెళ్లి, క్యాన్ ల‌కు క్యాన్ల ప్యూయ‌ల్ ను నింపుకొని త‌మ ప్రాంతాల్లో అమ్ముకుంటూ ల‌క్ష‌లు గ‌డిస్తున్నారు. నేపాల్ స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన బీహార్ రాష్ట్రంలోని ర‌క్సల్‌, సీతామర్హి ప్రాంతాల్లోని ప్రజలు తమ వాహనాల్లో పెట్రోల్‌ నింపుకునేందుకు పక్కనే ఉన్న పొరుగు దేశం నేపాల్ కు వెళుతున్నారు.

ఇండియాతో పోల్చితే అక్క‌డ( నేపాల్ ) పెట్రోల్ రేట్ 15 రూపాయ‌లు , డీజిల్ 18 రూపాయ‌లు త‌క్కువ‌గా ఉండ‌డంతో పాటు మ‌న 100 రూపాయ‌లు వారి 160 రూపాయ‌ల‌కు స‌మానం కావ‌డంతో…. ఈ ప్రాంతాల ప్ర‌జ‌లు నేపాల్ పెట్రోల్ బంక్ ల బాట‌ప‌డుతున్నారు. అంతేకాకుండా నేపాల్ లో ఏక ప‌న్ను వ్యవస్థ అమల్లో ఉండ‌డం అక్క‌డ రేట్ త‌క్కువ‌కు గ‌ల ప్ర‌ధాన కార‌ణం.

ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో..నేపాల్ పెట్రోల్ బంక్ లు క‌ల‌క‌ల‌లాడుతున్నాయి. రెగ్యుల‌ర్ అమ్మ‌కాల‌తో పోల్చితే ….15 నుంచి 20 శాతం పెరిగాయి నేపాల్ లో..!

Comments

comments

Share this post

scroll to top