హిందూ పేపర్ మెయిన్ రోడ్ మీద పెట్టిన ఆ హోర్డింగ్ చూస్తే “రాజకీయ నాయకులకు” పంచ్ పడటం పక్కా.!

రాజ‌కీయ నాయకులు అంటే.. అంతే.. మైకుల ముందుకు వ‌చ్చి జ‌నాల‌కు గంట‌ల త‌ర‌బ‌డి సుదీర్ఘ‌మైన ప్ర‌సంగాల‌ను వినిపిస్తారు. వాటిల్లో వారు మ‌న‌కు చేసే నీతి బోధ‌న‌లే ఎక్కువ‌గా ఉంటాయి. కానీ వాస్త‌వానికి చూస్తే.. నిజానికి మ‌నం వాటిని ఎప్ప‌టి నుంచో పాటిస్తూ వ‌స్తుంటాం. కానీ రాజ‌కీయ నాయ‌కులు మాత్రం వాటిని పాటించ‌రు. పైగా మ‌న‌కు ఇలా చేయాలి, అలా చేయాలి అని నీతులు చెబుతారు. ఇంత‌కీ అస‌లు ఇప్పుడు మేం చెప్ప‌బోయే విష‌యం ఏమిటంటే.. కింద ఇచ్చిన ఓ చిత్రాన్ని చూడండి. దాన్ని బాగా గ‌మ‌నించండి. అందులో ఏముంది..?

చూశారు క‌దా. ది హిందూ ప‌త్రిక ఓ ర‌హ‌దారి ప‌క్క‌న‌ పెట్టిన హోర్డింగ్ అది. అవును, నిజ‌మే. దాన్ని త‌మ ప‌త్రిక ప‌బ్లిసిటీ కోస‌మే అక్క‌డ పెట్టారు. కానీ అందులో అర్థ‌వంత‌మైన మెసేజ్‌ను మాత్రం రాజ‌కీయ నాయ‌కుల‌కు ఇచ్చారు. సింగిల్ కారు ఉన్న వారు ఎప్ప‌టిక‌ప్పుడు పెరిగిపోతున్న ఇంధ‌న ధ‌ర‌ల‌తో షాక్‌కు గురవుతుంటే.. 20 కార్లు ఉండే రాజ‌కీయ నాయ‌కుల‌కు మాత్రం ఇంధ‌న ధ‌ర‌ల ప‌ట్ల షాక్ ఎందుకు త‌గ‌ల‌డం లేదు. ఆలోచించండి.. నాయ‌కులు.. మిమ్మ‌ల్ని యూత్ చూస్తుంది.. అంటూ అందులో పెట్టారు.

అవును.. ఆ యాడ్‌లో పెట్టిన అక్ష‌రాల‌న్నీ ప‌చ్చి నిజాలే. మ‌న‌కు కేవ‌లం ఒక్క వెహిక‌ల్ ఉంటేనే నెల నెలా పెరిగే పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌కు షాక్ తింటాం. అలాంటిది ప‌దుల సంఖ్య‌లో వాహ‌నాలు ఉండి కూడా నాయ‌కుల‌కు ఇంధన ధ‌ర‌లు పెరిగితే క‌నీసం చీమ కుట్టిన‌ట్టు అయినా ఉండ‌దు. ఎందుక‌ని..? వారు బాగా సంపాదిస్తారు క‌నుక‌. సంపాద‌న వ‌స్తుంది, మ‌రో వైపు కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు ఎలాగూ ప్ర‌జా ప్ర‌తినిధులుగా ఉంటారు, దీంతో వారికి ప్ర‌భుత్వం నుంచి ఇంధన అల‌వెన్స్ వగైరా వ‌స్తాయి. క‌నుక వారికి పెరిగే పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌తో సంబంధం ఉండదు. కాబ‌ట్టి వారు 20 ఏమిటి.. అవ‌స‌రం అనుకుంటే 50.. ఇంకా అవ‌స‌రం అయితే 100 వాహ‌నాల‌ను కూడా కాన్వాయ్‌లో పెట్టుకుంటారు. కానీ సామాన్య జ‌నాల‌కు ఆ అవ‌కాశం లేదు క‌దా. పైగా స‌ద‌రు నాయ‌కులు ఇంధ‌నాన్ని ఆదా చేయండ‌ని గురివింద నీతులు అయితే బాగానే చెబుతారు. ఏం చేస్తాం.. అంతా మ‌న ఖ‌ర్మ కాక‌పోతే..!

Comments

comments

Share this post

scroll to top