మధురైలో బాహుబలి చిత్రాన్ని ప్రదర్శిస్తున్న జయలక్ష్మీ థియేటర్ పై పెట్రోల్ బాంబు దాడి చేశారు తమిళపులి సంస్థకు చెందిన కార్యకర్తలు. బాహుబలి సినిమాలో గిరిజనులను కించపరిచే డైలాగ్ లు ఉన్నాయంటూ… వారు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. వెంటనే సినిమా నుండి ఆ డైలాగ్లను తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే వీరు థియేటర్ ను లక్ష్యంగా చేసుకొని పెట్రోల్ బాంబ్ ను ప్రయోగించారు. ప్రేక్షకులు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.
జులై 10 న నాలుగు భాషల్లో విడుదలై .. హౌస్ ఫుల్ బోర్డులతో, హ్యండ్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళుతున్న బాహుబలికి ఇది ఎదురు దెబ్బలాంటిదే.. ఇటువంటి ఘటనలు ప్రేక్షకులను భయబ్రాంతులకు గురిచేస్తాయి. ఫ్యామిలీతో సినిమా చూద్దాం అనుకునే వారు ఇలాంటి ఘటనల వల్ల థియేటర్లకు దూరం అవుతారు.
గతంలో బాహుబలిలో మాల కులస్థులను కించపరిచే సన్నివేశాలున్నాయని వాటిని తొలగించాలని లేకుంటే బాహుబలిని అడ్డుకుంటామని మాలల జెఎసి కూడా హెచ్చరించింది. యూ ట్యూబ్ లోని కొన్ని దృశ్యాలను సేకరించి పోలీసులకు పిర్యాదు కూడా చేశారు వారు. మళ్ళీ ఇప్పుడు గిరిజనులను కించపరిచారంటూ తమిళపులి కార్యకర్తలు ఏకంగా పెట్రోల్ బాంబ్ ను థియేటర్ పైకి ప్రయోగించారు.