పేట స్టిల్స్ తో ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తున్న రజినీకాంత్, సర్వం రజినీ మయం, రజినీ మేనియా. పేట మూవీ స్పెషల్..!!

కేవలం పోస్టర్స్ తోనే ఫ్యాన్స్ కు ఎనలేని సంతోషాన్నిస్తుంది పేట. ఇప్పటివరకు పేట సినిమా నుండి విడుదల అయిన పోస్టర్స్ ఒకదానిని మించి మరొకటి ఉంది. కబాలి సినిమా తో రజినీకాంత్ తన పవర్ ఏంటో చూపించాడు, ఒక పాట, ఒక టీజర్ తో బాహుబలి ని మించిన క్రేజ్ ని చూపించాడు తలైవర్. ఆ సినిమాకు నెగటివ్ టాక్ రావడం తో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఆ తరువాత వచ్చిన కాలా చిత్రం ఫర్వాలేదనిపించినా, రజినీ స్థాయి కలెక్షన్స్ ని రాబట్టలేకపోయింది. ఇటీవల విడుదల అయిన 2.0 చిత్రం తో బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టాడు, తెలుగు తమిళ్ హిందీ బాషలలో కలెక్షన్ల సునామి సృష్టించాడు.

పేట తో పేట పేట పేకాట ఆడటం ఖాయం :

సంక్రాంతి కానుకగా జనవరి 10 న విడుదల కాబోతున్న పేట సినిమా తో అభిమానులనే కాదు, సామాన్య ప్రేక్షకులను కూడా కచ్చితంగా ఆకట్టుకుంటాడని డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ధీమా వ్యక్తం చేసాడు. పేట సినిమా అందరికి కచ్చితంగా నచ్చుతుంది, రజినీకాంత్ ఫ్యాన్ గా రజినీకాంత్ గారిని ఎలా చూపిస్తే ఫ్యాన్స్ ఆనంద పడతారో, అదే విధంగా చూపించా అని చెప్పారు కార్తీక్ సుబ్బరాజ్.

కబాలి కాదు బాషా.. :

ఇన్ని ఎక్సపెక్టషన్స్ తో వస్తున్న చిత్రం కావడంతో కబాలి లాగే అవుతాదేమో అని కొందరు అనుకుంటున్నారు, కానీ తలైవర్ ఫ్యాన్స్ మాత్రం పేట సినిమా కచ్చితంగా బాషా సినిమా రేంజ్ లో ఉంటాదని గట్టిగా నమ్ముతున్నారు. అందుకు ముఖ్య కారణం డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్. కార్తీక్ సుబ్బరాజ్ గత చిత్రాలు పిజ్జా, జిగర్తాండ చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. పిజ్జా సినిమా తెలుగు లో చాలా బాగా ఆడింది.

అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు కుమ్ముడే :

పేట చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజ్ లో జరుగుతున్నాయి. అమెరికా లో 2.0 ప్రీమియర్స్ గ్రాస్ ని పేట చిత్రం ప్రీమియర్స్ తో దాటడం ఖాయం. ఇక యూరోప్, ఆస్ట్రేలియా, మలేషియా లలో కూడా పేట చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి. ఆంధ్ర రాష్ట్రాల్లో తెలుగు సినిమాలు పోటీ లో ఉండటంతో మొదటి వారం తక్కువ థియేటర్స్ లోనే విడుదల అవుతుంది, రెండో వారం నుండి థియేటర్లు పెరగనున్నాయి. ఇక తమిళ్ నాడు లో అజిత్ హీరో గా నటించిన విశ్వాసం సినిమా కూడా జనవరి 10 వ తేదీనే విడుదల అవుతుండటం తో అక్కడ కూడా గట్టి పోటీనే ఎదురుకోనుంది పేట సినిమా.

సాంగ్స్, ట్రైలర్ అదరహో :

అనిరుద్ పేట సినిమాకి సంగీతం అందించాడు, పేట సినిమా ఆడియో బంపర్ హిట్, ఎక్కడ చూసినా పేట సినిమాలోని పాటలే, ఇక ట్రైలర్ తో సినిమా రేంజ్ నే పెంచేసాడు సూపర్ స్టార్ రజినీ. పేట సినిమా లో సిమ్రాన్, విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్దికీ, త్రిష, బాబీ సింహ, మేఘ ఆకాష్ నటీ నటులు గా నటించారు. అయితే ఈ సినిమాకు ఆకర్షణ మాత్రం సూపర్ స్టార్ రజినీకాంత్ ఏ. ట్రైలర్ లో ఆయన స్మైల్ అండ్ స్టైల్ చూస్తుంటే అభిమానులు ఆనందం తో ఉభితబ్బిపైపోతున్నారు.
మొత్తానికి ఈ పండక్కి మనం స్వీట్ తినబోతున్నాం.

Comments

comments

Share this post

scroll to top