సంబరాల్లో మునిగితేలుతున్న రజినీకాంత్ అభిమానులు,బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న పేట – పేట రివ్యూ..

ఎప్పటినుండో రజినీకాంత్ అభిమానులు ఆశ గా ఎదురుచూస్తున్న సినిమా వాళ్లకు పేట రూపం లో దొరికింది, రజినీకాంత్ చరిష్మా, స్టైల్, స్మైల్, యాక్షన్.. ఒకటి కాదు, రెండు కాదు రజినీకాంత్ ని ఎలాగైతే చూడాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారో అలాగే చూపించాడు కార్తీక్ సుబ్బరాజ్.

పేట పేట ను దున్నేయ్యడం ఖాయం :

రజినీకాంత్ ఎంట్రీ నుండే అభిమానులు సంబరాలు మొదలెట్టారు, ఇంక సినిమా అయ్యే వరకు ఆపలేదు. సిమ్రాన్ – రజినీకాంత్ మధ్య సీన్స్ చూట్టానికి చాలా బాగున్నాయి, మాస్ మరణం సాంగ్ కి థియేటర్ టాప్ లేచిపోతాదేమో అన్నంతగా హడావిడి చేసారు రజిని అభిమానులు.ఇక నటీ నటుల విషయానికి వస్తే నావాజ్జుద్దీన్ సిద్ధికి, విజయ్ సేతుపతి, బాబీ సింహా, శశికుమార్ లు వాళ్ళ అనుభవాన్ని అంతా ఈ సినిమా లో చూపించారు, వారు వారి పాత్రల్లో జీవించేసారు. త్రిష, సిమ్రాన్, రజినీకాంత్ సరసన కరెక్ట్ గా సెట్ అయ్యారు.

వన్ మ్యాన్ షో :

పేట సినిమా చుసిన ప్రతి ఒక్కరి నోటి వెంట ఒకటే మాట, రజినీకాంత్ ఒక్కడే దున్ని పడేసాడు సినిమా మొత్తం అని. రజినీకాంత్ కి డై హార్డ్ ఫ్యాన్ అయిన కార్తీక్ సుబ్బరాజ్, రజినీకాంత్ ని ఎలా చూపియాల్లో అలాగే చూపించాడు,అందుకే రజిని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా 1st హాఫ్ ఫ్యాన్స్ కి పండగే. అనిరుద్ పాటలు కానీ, నేపధ్య సంగీతం సంగీతం కానీ అద్భుతం అంతే, ముఖ్యంగా ఫైట్ సీన్స్ లో అనిరుద్ నేపధ్య సంగీతం సీన్స్ కి మంచి బూస్ట్ ఇచ్చాయి, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం ని మెచ్చుకొని తీరాల్సిందే, రజినీకాంత్ ఇటీవలి సినిమాలలో ఫ్యాన్స్ ని ఈ సినిమా ఆకట్టుకున్నంత మరే సినిమా ఆకట్టుకోలేదు, సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సంక్రాంతి పండక్కి రజినీకాంత్ మనకి స్వీట్ తినిపించాడు.

Positves :

రజినీకాంత్
రజినీకాంత్
రజినీకాంత్

Negatives :

సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్, నిడివి

రేటింగ్  : 3.75/5

Comments

comments

Share this post

scroll to top