వైఎస్. జగన్ పేరు మార్చుకున్నారంట.? కారణం అదేనంట.? ఇకపై ఆయన్ని ఏమని పిలవాలంటున్నారంటే..!

జెఎమ్ ఆర్ జిందాబాద్..జిందాబాద్ జిందాబాద్.. త్వరలో ఓదార్పు యాత్ర చేపట్టనున్న జెఎమ్ ఆర్ అన్న..పాదయాత్ర చేయబోతున్న జెఎమ్ ఆర్..అరే ఈ జెఎమ్ ఆర్ ఎవరూ రా భయ్..ఇప్పటికే ఉన్న అన్నలకు జిందాబాద్ చెప్పలేక చస్తున్నాం..జగనన్న ఓదార్పు యాత్ర అంటాడు ఈ జెఎమ్ ఆర్ అన్న ఎవరు ఎందుకు ఓదార్పు యాత్ర చేస్తుండు..ఒకవైపు పవనన్న పాదయాత్ర అంటుండు,మరొవైపు జగనన్న పాదయాత్ర అంటుుండు మధ్యలో ఈ జెఎమ్ ఆర్ అన్న పాదయాత్ర దేనికి చేస్తుండు అని అనుకుంటున్నారా..గుస్సా గాకుండ్రి..ఆ విషయమే చెప్తున్నా..ఈ జెఎమ్ ఆర్ ఎవరో కాదు మన జగనన్నే..న్యూమరాలజీ ప్రకారం పేరు మార్చుకున్నడట.ఇంక అఫీషియల్ గా అనౌన్స్ చేయలే కానీ ,అన్ అఫీషియల్ గా ఇదే పేరు ఖరారైందని వార్తలోస్తున్నాయి.పాదయాత్ర ఫ్లెక్సీలల్ల కూడా ఇదే పేరుతో దర్శనమిస్తున్నడంట జగనన్న..అప్పుడు తెలిసిపోతుంది ఈ వార్తలు ఎంత నిజమో..

దివంగత వైఎస్ ఆర్ తనయుడు, వైసీపీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల కోసం అన్ని విధాలుగా రెడీ అవుతున్నారు.. వచ్చే ఎన్నికల్లో జగన్ సీఏం అవ్వలన్నా, వైసీపీ విజయం సాధించాలన్నా,ఇప్పుడు చేపట్టబోయే   పాదయాత్ర చాలా ముఖ్యమని జగన్ గట్టి విశ్వాసంలో ఉన్నారు. నరేంద్ర మోఢీ, నితీష్ కుమార్ వంటి దిగ్గజాలను తన సోషల్ మీడియా సలహాలు, వ్యూహాలతో దేశ ప్రధాని, బీహార్ సీఎంలను చేసిన ప్రశాంత్ కిషోర్ ను ఇప్పుడు తన సలహాదారుగా నియమించుకుని మరీ ముందుకు సాగుతున్నారు జగన్.అధికార టీడీపీ నుంచి ఎన్ని అడ్డంకులు ఎదురయినా వెనుతిరిగేది లేదని ఫిక్స్ అయ్యింది వైసీపీ. అయితే గతంలో ఎన్నడూ లేనిది జగన్ మోహన్ రెడ్డికి ఇటీవల జాతకాలూ, ఇతరత్రా విషయాల మీద నమ్మకం పెరిగినట్టు చెబుతున్నారు. జగన్ పాదయాత్ర విషయం లో కూడా రెండు మూడు సార్లు డేట్లు మార్చడానికి కారణం ఇదేనట. ఇప్పుడు ఆయన జాతక రీత్యా  పేరు మార్చుకున్నారని వార్తలు వస్తున్నాయి.

తన పేరు ని ఒక న్యూమరాలజిస్ట్, ఇద్దరు పేరు మోసిన ఆస్ట్రాలజీ వ్యక్తుల సాయం తో మార్చుకున్నారట. జగన్ పేరు ఇక మీదట జగన్ మోహన్ రెడ్డి కంటే కూడా ‘ J M R ’ గా పిలిస్తే రాజకీయంగా బాగా కలిసివస్తుందని వారు సూచించారట. JMR అంటే జగన్ మోహన్ రెడ్డి. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ని అందరూ వైఎస్సార్ అన్నట్టుగా జగన్ ని ఇప్పుడు అలా పిలవాలి అని ఫిక్స్ చేసారట. చంద్రబాబు, కేసీఆర్ లు ముహూర్తాలు, జాతకాలు, వాస్తులు లేనిదే ఏ పనీ చేయడంలేదు. అన్నీ కలిసొచ్చి రాజకీయంగా పీఠాలెక్కిన వారే  నమ్మకాలకు ప్రాధాన్యం ఇస్తుంటే.. కాలం కలిసి రావాలని కోటి ఆశలతో ముందుకు సాగుతున్న జగన్ లో ఈ మాత్రం నమ్మకం ఏర్పడడంలో వింతేం ఉంది..మీరు ప్రిపేర్ అవుండ్రి..జై జెఎమ్ ఆర్..జై జై జెఎమ్ ఆర్..

ఎన్టీయార్,ఎఎన్ ఆర్,వైఎస్సార్,సిబిఎన్,కెసిఆర్,కెటిఆర్ ,ఎంజీఆర్….ల మాదిరిగానే ఇకపై జెఎమ్ ఆర్ అన్నమాట…

Comments

comments

Share this post

scroll to top