పీరియడ్స్ గురుంచి అందరికి తెలియాలి – పీరియడ్స్ ఫెస్ట్ స్పెషల్..!

పీరియడ్స్( రుతుస్రావం).. ఆడవాళ్ళూ పీరియడ్స్ గురించి బహిరంగంగా మాట్లాడటానికి ఇబ్బంది పడతారు, పీరియడ్స్ గురించి బహిరంగంగా మాట్లాడాలి, ముఖ్యంగా చిన్న పిల్లలకు వీటి గురించి తెలియాలి అని గైనకాలజిస్టు డాక్టర్. సురభి సింగ్ వివరించారు, డాక్టర్. సురభి సింగ్ మాట్లాడుతూ ‘నెలసరి ఎందుకొస్తుందని అమ్మాయిలు తరచూ అడుగుతుంటారు. అమ్మాయిలకు మాత్రమే ఎందుకొస్తుంది? ఆ సమయంలో నొప్పి ఎందుకొస్తుంది? వంటి చిన్నిచిన్న ప్రశ్నలు వేస్తుంటారు. ఈ ప్రశ్నలను దాటవేయకూడదు. వారికి విరించేందుకు ప్రయత్నించాలి. బాలికలకు చిన్న వయసులోనే చెప్తే తొందరగా అర్థం చేసుకుంటారు’ అని ఫిబ్రవరి 5న ఢిల్లీ లో జరిగిన ‘పీరియడ్ ఫెస్ట్ కార్యక్రమం లో సురభి సింగ్ ప్రసంగించారు.

మనుషుల సమస్య..:

“చిన్నతనంలోనే పిల్లలు ఏది చెప్పినా తొందరగా అర్థం చేసుకుంటారు కాబట్టి, పాఠశాల స్థాయిలోనే బాలికలకు నెలసరి గురించి అవగాహన కల్పించాలి, పీరియడ్స్ గురించి అమ్మాయిలతో మొదట చర్చించాల్సింది ఉపాధ్యాయులే. పీరియడ్స్ అంటే మన శరీరంలో వచ్చే అనేక సానుకూల మార్పులకు సంకేతమని బాలికలకు వివరించాలి. నెలసరి వస్తే ఎవరూ భయపడాల్సిన అవసరంలేదు, బాలికలు ఎప్పుడూ ప్యాంటీ, ప్యాడ్, పేపర్, పేపర్ సోప్ లాంటివి వెంట ఉంచుకుంటే ఇబ్బంది ఉండదు. పీరియడ్స్ రావడం మహిళల సమస్య కాదు. ఇది మనుషుల సమస్య” అని సురభి సింగ్ వివరించారు.

వారి అనుభవాలు.. :

ఈ కార్యక్రమం లో ఢిల్లీ లోని గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థినిలు పాల్గొన్నారు, విద్యార్థినిలు కొందరు వారికి ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ‘రుతుస్రావం అయిన రోజు దేవుడి విగ్రహాలను/ పటాలను ముట్టుకోకూడదు అని, తల స్నానం చెయ్యకూడదు అని మా అమ్మ నాతో చెప్పింది, మా అమ్మకు వాళ్ళ అమ్మ చెప్పారు అంట, ఇదంతా ఒక మూఢనమ్మకం అని మా అక్క నాతో చెప్పింది, తరతరాలనుండి ఇలా మూఢనమ్మకాలను తదుపరి జనరేషన్ వాళ్ళకి చెప్పి వాళ్ళను నమ్మించి, ఇలా ఈ తతంగం సాగుతూనే ఉంది, దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని’ ఈ కార్యక్రమం లో పాల్గొన్న ఒక విద్యార్థిని తెలిపింది.

అన్నయ్య తో ఎలా… :

నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు ప్యాడ్స్ తెమ్మని మా అన్నయ్యకు చెబితే, మీ అన్నయ్య మగవాడు, అతను ఎలా ప్యాడ్స్ తెస్తాడు. అయినా అన్నయ్య తో ఎలా తెప్పించుకుంటావ్ అని మా అమ్మ నాతో అనడంతో నేనే వెళ్లి తెచ్చుకున్నా చివరికి’ అని మరో యువతి తెలిపింది. ‘ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి చాలా మందికి. ఆడా మగా అని చూడకూడదు, అవసరానికి సాయం అందించాలి. విచిత్రం ఏంటంటే స్వయంగా బాధలు అనుభవించిన అమ్మ కూడా మనల్ని ఈ మూఢనమ్మకాలు, ఆడా మగా అని అన్నప్పుడు జాలి పడాలో కోప్పడలో అర్ధం కాలేదు’ అని ఒక విద్యర్థిని చెప్పింది.

 

Comments

comments

Share this post

scroll to top