పీరియ‌డ్స్ ర‌క్త‌స్రావం యూనిఫాంపై అంటినందుకు తిట్టిన టీచ‌ర్‌.. విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌..!

మ‌హిళ‌ల‌కు రుతు క్ర‌మం అనేది నెల నెలా వ‌స్తూనే ఉంటుంది. ఈ క్ర‌మంలో వారు అందుకు త‌గిన విధంగా ఏర్పాట్లు చేసుకుంటారు. శానిట‌రీ ప్యాడ్స్ వాడ‌తారు. అయితే పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో చ‌దువుకునే విద్యార్థినుల‌కు వీటిని వాడ‌డంలో కొంత అవ‌గాహ‌న లోపం వ‌స్తుంటుంది. అలాంట‌ప్పుడు ఇంట్లో తల్లి లేదా ఇత‌ర మ‌హిళా కుటుంబ స‌భ్యులు చెప్ప‌వ‌చ్చు. లేదంటే పాఠ‌శాల‌లో ఉపాధ్యాయురాలు కూడా చెప్ప‌వ‌చ్చు. ఇందులో సిగ్గు ప‌డాల్సిన, త‌ప్పు పట్టాల్సిన అంశం ఏదీ లేదు. అయితే అలా అవ‌గాహ‌న లేక తాను చేసిన చిన్న త‌ప్పుకు ఆ విద్యార్థిని బ‌లైంది. ఇంత‌కీ అసలు ఏం జ‌రిగిందంటే…

అది త‌మిళనాడులోని పాలాయంకొట్టైలో ఉన్న‌ సెంథిల్ న‌గ‌ర్ స్కూల్‌. అందులో స్థానికంగా ఉన్న ఓ విద్యార్థిని 7వ త‌ర‌గ‌తి చ‌దువుతోంది. ఆమె వ‌య‌స్సు 12 సంవ‌త్స‌రాలు. అయితే ఆ విద్యార్థిని గ‌త నెల 30వ తేదీన స్కూల్‌కు య‌థావిధిగా వెళ్లింది. కానీ ప్యాడ్ స‌రిగ్గా ఉప‌యోగించ‌డంలో అవ‌గాహ‌న లేక‌పోవ‌డంతో కొంత ర‌క్త‌స్రావం యూనిఫాంకు అంటింది. దాన్ని గ‌మ‌నించిన తోటి విద్యార్థినులు ఆమెకు విష‌యం చెప్పారు. దీంతో ఆ విద్యార్థిని వాష్ రూమ్‌కు వెళ్లేందుకు క్లాస్‌లో ఉన్న ఉపాధ్యాయురాలిని ప‌ర్మిష‌న్ అడిగింది.

అయితే ఆ ఉపాధ్యాయురాలు అందుకు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేదు. ప్యాడ్ స‌రిగ్గా ఎందుకు వాడ‌లేక‌పోయావు అంటూ తిట్టింది. అంద‌రు విద్యార్థినుల ముందు అవ‌మానించేలా మాట్లాడింది. అనంత‌రం ఆ విద్యార్థినిని ఆ ఉపాధ్యాయురాలు స్కూల్ ప్రిన్సిపాల్ వ‌ద్ద‌కు తీసుకెళ్ల‌గా, స్కూల్ ప్రిన్సిపాల్ ఆ విద్యార్థినిని ఇంటికి పంపించారు. అది జ‌రిగిన మరుస‌టి రోజు ఉద‌యాన్నే 3 గంట‌ల ప్రాంతంలో ఆ విద్యార్థిని త‌మ ఇంటి ప‌క్క‌నే ఉన్న ఓ బంగ్లా పై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. త‌న చావుకు కార‌ణం ఆ అవ‌మాన‌మేన‌ని ఆమె త‌న సూసైడ్ లెట‌ర్‌లో రాసింది. దీంతో విష‌యం తెలుసుకున్న విద్యార్థిని త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యులు, బంధువులు, స్థానికులు స్కూల్ ఎదుట ఆందోళ‌న చేశారు. బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజంగా ఈ ఘ‌ట‌నకు మ‌నం అంద‌రం సిగ్గుతో త‌ల‌దించుకోవాలి. ఎందుకంటే… ఎదిగే వ‌య‌స్సులో పిల్ల‌ల‌కు అనేక అంశాల ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించాలి. ఉపాధ్యాయులు కూడా ఆ బాధ్య‌త నెరవేర్చాలి. అలా చేయ‌కుండా విద్యార్థిని ఆ టీచ‌ర్ తిట్టిందంటే ఇక ఆమెను ఏమ‌నుకోవాలి. తాను కూడా సాటి ఆడ‌దాన్ని అనే విష‌యం మ‌రిచిపోయిందా..? ఇలాంటి వారిని ఏం చేస్తే బాగుంటుంది..!

Comments

comments

Share this post

scroll to top