పీరియడ్… ఎండ్ ఆఫ్ సెంటెన్స్ చిత్రీకంరించింది ఇక్కడే..

2019 సంవత్సరానికి గాను ఆస్కార్ అవార్డుల విజేతలను డాబ్లీ థియేటర్ వేదికగా ప్రకటించారు. ఇండియా తరపున ఎన్నో చిత్రాలు ఎంపికైనా ఒక్క చిత్రం కూడా ఆస్కార్ గెలుచుకోలేకపోయాయి. అయితే భారతీయ డాంక్యుమెంటరీ పిరియడ్ : ఎండ్ ఆఫ్ సెంటెన్స్ ను ఆస్కార్ వరించింది. రేఖా జెహతాబ్చి దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీని గునీత్‌ మోంగా నిర్మించారు.

ఆడవారికి అత్యంత సాధారణమైన ఋతుస్రావంపై దేశంలో ఇప్పటికి సరైన అవగాహన లేదు. దీంతో దీన్నే కథాంశంగా తీసుకుని రేఖా డాక్యుమెంటరీని తెరకెక్కించారు. ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌ ప్రాంతంలో ఈ డాక్యుమెంటరీని చిత్రికరించారు. ఇది దేశ రాజధానికి ఢిల్లీకి సమీపంలో ఉంటుంది. కతికెరాలోని శానిటరీ ప్యాడ్స్ తయారుచేసే ఫ్యాక్టరీలో పని చేసే స్నేహ్.. 25 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీలో హీరోయిన్‌గా నటించారు.
దిల్లీకి 115 కి.మీ. దూరంలో, ధగధగమంటూ వెలిగిపోయే ఎలాంటి షాపింగ్ మాల్స్ లేని గ్రామం అది. హపూర్ జిల్లా కతికెరా గ్రామానికి చేరాలంటే దిల్లీ నుంచి 2.30 గంటల ప్రయాణం చేయాలి. కతికెరా గ్రామ పంటపొలాల్లో, గ్రామ పాఠశాలలోని తరగతి గదుల్లో ఈ డాక్యుమెంటరీ తీశారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లాగే ఈ గ్రామంలో కూడా, మహిళల నెలసరి గురించి మాట్లాడటం తప్పుగా భావిస్తున్నారు.నెలసరి సమయాల్లో, మహిళలు అపవిత్రం అని భావించి, వారిని గుళ్లుగోపురాలకు, సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉంచుతారు. ఇలాంటి అపోహల మధ్య పెరిగిన స్నేహ్.. తను పుష్పవతి అయ్యేవరకూ మహిళల నెలసరి గురించి వినకపోవడంలో ఆశ్చర్యం లేదు.
కానీ.. పునరుత్పత్తికి చెందిన ఆరోగ్య సమస్యల గురించి పనిచేస్తున్న ‘యాక్షన్ ఇండియా’ అనే స్వచ్ఛంద సంస్థ, స్నేహ్ గ్రామంలో శానిటరీ ప్యాడ్ల తయారీ కేంద్రం స్థాపించాక పరిస్థితులు మారాయి.
ఈ శానిటరీ ప్యాడ్స్ ఫ్యాక్టరీలో 8 మంది మహిళలు పని చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలో రోజుకు సగటున 600 శానిటరీ ప్యాడ్లు తయారు అవుతున్నాయి. వీటిని ‘ఫ్లై’ పేరిట మార్కెట్లో విక్రయిస్తున్నారు.

పీరియడ్ డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు రావడం పట్ల హపూర్‌ వాసులు హర్షం వ్యక్తం చేశారు. శానిటరీ ప్యాడ్లు తయారు చేసే ఫ్యాక్టరీలో పని చేసే మహిళలు ఆనందంతో డ్యాన్స్ చేశారు.

Comments

comments

Share this post

scroll to top