వ్య‌క్తుల‌కు ఉండే ముక్కు సైజ్‌, షేప్‌ల‌ను బ‌ట్టి ఎవరు ఎలాంటి వారో ఇలా చెప్ప‌వ‌చ్చు తెలుసా..?

వ్య‌క్తుల‌కు ఉండే ముక్కు షేప్‌, సైజ్ ను బ‌ట్టి వారి వారి వ్య‌క్తిత్వాలు ఎలా ఉంటాయో తెలుసుకోవ‌చ్చా..? అంటే… అవును, తెలుసుకోవ‌చ్చు. గ‌తంలోనూ ఇలా ప‌లు విభిన్న‌మైన అంశాల‌ను బ‌ట్టి వ్య‌క్తుల వ్య‌క్తిత్వాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాం క‌దా. కానీ… ఇప్పుడు మరో కొత్త అంశం వ‌చ్చి ప‌డింది మ‌రి. అదే ముక్కు. క‌నుక వ్య‌క్తుల‌కు ఉండే ముక్కు సైజ్‌, షేప్‌ల‌ను బ‌ట్టి వారి వ్య‌క్తిత్వాలు ఎలా ఉంటాయో, వారు ఎలాంటి మ‌న‌స్త‌త్వం క‌లిగి ఉంటారో, ఏం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

పెద్దదైన ముక్కు ఉంటే…
ముక్కు సైజ్ పెద్ద‌గా ఉన్న వారు మంచి నాయ‌కులు అవుతార‌ట‌. వీరి అంద‌రినీ ప్ర‌భావితం చేయ‌గ‌ల శ‌క్తివంతులుగా ఉంటార‌ట‌. స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు వీరిలో పుష్క‌లంగా ఉంటాయ‌ట‌. వీరికి స్వ‌తంత్ర భావాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ట‌. ఎలాంటి ఇగోల‌కు పోర‌ట‌. వీరికి త‌మ‌పై అధికారం చెలాయించే వారంటే న‌చ్చ‌ర‌ట‌.

చిన్న ముక్కు ఉంటే…
చిన్న ముక్కు ఉన్న‌వారికి సామాజిక అంశాల పట్ల శ్ర‌ద్ధ ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. మృదు స్వ‌భావులు అయి ఉంటార‌ట‌. కొన్ని సార్లు షార్ట్ టెంప‌ర్‌కు లోన‌వుతార‌ట‌.

పొడ‌వైన ముక్కు ఉంటే…
వీరికి కూడా నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ఎక్కువే. అయితే వీరు వ్యాపార రంగంలో రాణిస్తార‌ట‌. ఇత‌రుల మ‌న‌సులో ఉన్న విష‌యాల‌ను పసిగ‌ట్టే శ‌క్తి వీరికి ఉంటుంద‌ట‌.

నిటారైన ముక్కు ఉంటే…
వీరు ఇత‌రుల‌కు ఆద‌ర్శంగా నిలుస్తార‌ట‌. ఇలాంటి వారితో స్నేహం చేస్తే ఆ స్నేహితుల‌కు వీరు అన్ని స‌మ‌యాల్లోనూ ప‌క్క‌నే ఉంటార‌ట‌. ఎలాంటి క‌ష్టాన్న‌యినా ఎదిరించ‌గ‌ల‌ర‌ట‌. అయితే ఒక్కోసారి వీరు సరిగ్గా ఆలోచించ‌లేర‌ట‌.

వెడ‌ల్ప‌యిన ముక్కు…
వీరు దృఢ‌చిత్త‌మైన మ‌నస్త‌త్వం, వ్య‌క్తిత్వం కలిగి ఉంటార‌ట‌. వీరిని లొంగ‌దీసుకోవ‌డం ఎవ‌రి త‌ర‌మూ కాద‌ట‌. వీరు ఇత‌రుల‌ను ఎక్కువగా ప్ర‌భావితం చేయ‌గ‌ల‌ర‌ట‌. అంతేకాదు, వీరు ఆవేశంలో నిర్ణ‌యాలు తీసుకోర‌ట‌, ఆలోచించి మాత్ర‌మే నిదానంగా నిర్ణ‌యాలు తీసుకుంటార‌ట‌.

నూబియ‌న్ ముక్కు…
వీరు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకునేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త మార్గాల‌ను అన్వేషిస్తార‌ట‌. వీరు ఏ విష‌యం ప‌ట్ల‌నైనా ఉత్సాహం ప్ర‌ద‌ర్శిస్తార‌ట‌. ఓపెన్ మైండెడ్‌గా ఉంటార‌ట‌. వీరు ఇత‌రుల‌ను ఎక్కువ‌గా ఆక‌ట్టుకుంటార‌ట‌.

ఫ్లెషీ ముక్కు…
వీరు ఏ విష‌యంపైనైనా చాలా త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకుంటార‌ట‌. ఏ మాత్రం ఆలోచించ‌ర‌ట‌. వీరు స‌హ‌జంగా ప్ర‌తిభావంతులు అయి ఉంటార‌ట‌. స‌మ‌స్య‌లు ఎదురైన‌ప్పుడు చాలా తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తార‌ట‌.

ముక్కు పైకి ఉంటే…
వీరు ఓ అంశం ప‌ట్ల అయినా నిర్దిష్ట‌మైన అభిప్రాయాల‌ను క‌లిగి ఉంటార‌ట‌. అంత త్వ‌ర‌గా ఆ అభిప్రాయాల‌ను మార్చుకోర‌ట‌. వీరు గొప్ప ప్రేమికులుగా ఉంటార‌ట‌. ఇత‌రుల‌కు బాగా స‌పోర్ట్‌నిస్తార‌ట‌.

రోమ‌న్ ముక్కు…
వీరు జీవితం ప‌ట్ల క‌చ్చిత‌మైన అభిప్రాయాల‌ను క‌లిగి ఉంటార‌ట‌. వీరికి నిర్దిష్టమైన ల‌క్ష్యాలు ఉంటాయ‌ట‌. ప్ర‌తి దాన్ని నేర్చుకోవాల‌ని చూస్తార‌ట‌. వీరికి కూడా నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ఎక్కువేన‌ట‌. అయితే ఏ అంశంపైనైనా అంత త్వ‌ర‌గా నిర్ణ‌యాలు తీసుకోర‌ట‌. చాలా సేపు ఆలోచించి గానీ ఓ నిర్ణ‌యం తీసుకోర‌ట‌.

Comments

comments

Share this post

scroll to top