టైట్ జీన్స్ వేస్తున్నారా? అయితే ఇదిగో ఈ న్యూస్ మీకోస‌మే.!!

జీన్స్‌… జీన్స్ అంటే వైద్య ప‌ర‌మైన జీన్స్ అనుకునేరు. కాదు, వేసుకునే జీన్స్‌. వాటిల్లో ప్ర‌స్తుతం మ‌న‌కు ఎన్నో ర‌కాలు ల‌భిస్తున్నాయి. చాలా డిజైన్స్ వ‌చ్చాయి. అయితే ఎవ‌రైనా త‌మ ఇష్టాలు, అనుకూల‌త‌ల‌ను బ‌ట్టి జీన్స్ వేసుకుంటారు. ఈ క్ర‌మంలోనే చ‌ర్మానికి అతుక్కుపోయేలా కొన్ని జీన్స్ ఉన్నాయి. వాటిని స్కిన్ టైట్ జీన్స్ అంటారు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటి..? అంటారా… ఏమీ లేదండీ… ఇప్పుడు మేం చెప్ప‌బోయేది ఈ స్కిన్ టైట్ జీన్స్ గురించే. వాటి వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి అనారోగ్యాలు క‌లుగుతాయో, వాటిని వేసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి దుష్ప‌రిణామాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. స్కిన్ టైట్ జీన్స్ వేసుకోవడం వ‌ల్ల ఎవ‌రికైనా తొడ‌లు, పిరుదులు, న‌డుం త‌దిత‌ర భాగాల్లో ఉండే కొవ్వు పైకి వ‌స్తుంది. దీంతో ఆ కొవ్వు ఇత‌ర భాగాల‌కు వ్యాప్తి చెందుతుంది. అప్పుడది హార్ట్ స్ట్రోక్స్‌, ఊపిరి తిత్తులు, జీర్ణాశ‌య సంబంధ వ్యాధుల‌కు దారి తీస్తుంది.

2. పురుషుల్లో అయితే స్కిన్ టైట్ జీన్స్ వ‌ల్ల వృష‌ణాలు దెబ్బ తింటాయి. అక్క‌డి న‌రాలు బాగా చెడిపోతాయి. దీంతో వీర్యం స‌రిగ్గా ఉత్ప‌త్తి కాదు. ఇది సంతాన సాఫ‌ల్య‌త‌పై ప్ర‌భావం చూపుతుంది. దీంతో పిల్లలు పుట్టే అవ‌కాశం త‌గ్గుతుంది. అంతేకాదు, అలాంటి పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం కూడా తగ్గిపోతుంది.

3. కాళ్ల‌లో ర‌క్త నాళాలు దెబ్బ తింటాయి. వాటిల్లో ర‌క్తం స‌ర‌ఫ‌రా స‌రిగ్గా అవ్వ‌దు. బ్ల‌డ్ క్లాట్ అవుతుంది. దీంతో గుండె సంబంధ వ్యాధులు వ‌స్తాయి. కాళ్ల‌లో న‌రాలు దెబ్బ తిని ఉబ్బుతాయి. బాగా నొప్పి ఉంటుంది.

4. స్కిన్ టైట్ జీన్స్ వేసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో ఉండే క్రియేటిన్ కైనేజ్ ఎంజైమ్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో అది కండ‌రాల‌పై ప్ర‌భావం చూపుతుంది. ఫ‌లితంగా కిడ్నీలు కూడా చెడిపోయేందుకు అవ‌కాశం ఉంటుంది.

5. స్కిన్ టైట్ జీన్స్ వ‌ల్ల శ‌రీర ఆకృతిలో మార్పు వస్తుంది. శ‌రీరం అస‌హ‌జంగా ఉంటుంది. బాడీ షేప్ స‌రిగ్గా ఉండ‌దు. దీంతో చూసేవారికి అంద‌విహీనంగా క‌నిపిస్తారు.

Comments

comments

Share this post

scroll to top