15 ల‌క్ష‌ల కోసం ఎదురు చూస్తున్న జ‌నం – మోడీ ద‌య త‌లిచేనా – ఖాతాదారుల‌కు ల‌బ్ధి చేకూరేనా

దేశం యావ‌త్తు భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ నిర్ణ‌యం కోసం క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురు చూస్తోంది. 2016లో అర్ధ‌రాత్రి నోట్ల‌ను ర‌ద్దు చేస్త‌న్న‌ట్లు ప్ర‌క‌టించిన స‌మ‌యంలో ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న కోట్లాది ప్ర‌జ‌లకు ఆన‌దం క‌లిగించింది. ఆ త‌ర్వాత అది ఆవిరి అయిపోయింది. ఇదే స‌మ‌యంలో న‌ల్ల ధ‌నాన్ని తీసుకు వస్తామ‌ని.వ‌చ్చిన డ‌బ్బుల‌తో ప్ర‌తి జ‌న్ ధ‌న్ ఖాతాలో 15 ల‌క్ష‌ల రూపాయ‌లు జ‌మ చేస్తామ‌ని లేదంటే త‌ల న‌రుక్కుంటాన‌ని మోడీ జ‌నం సాక్షిగా ప్ర‌క‌టించారు. 2019లో దేశ వ్యాప్తంగా పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. మ‌ళ్లీ అధికారంలోకి రావాలంటే ఇచ్చిన హామీల‌పై దృష్టి పెట్ట‌క త‌ప్ప‌దు. మోడీ, అమిత్ షా ద్వ‌యానికి గ‌తంలో ఎదురే లేకుండా పోయింది. అటు పాలన‌లో ఇటు పార్టీలో వారే నెంబ‌ర్ వ‌న్. ఇంకొక‌రికి చోటు లేకుండా చేశారు.

వీరిద్దరు ఎక్క‌డ వుంటే అక్క‌డ సైలంట్ గా ఆప‌రేషన్ జ‌రిగేది. విజ‌య‌బావుటా ఎగుర వేశారు. ఇపుడు ప‌రిస్థితి అందుకు భిన్నంగా త‌యారైంది. రాహుల్ గాంధీ దెబ్బ‌కు మోడీ చ‌రిస్మా కొద్ది కొద్దిగా మ‌స‌క బారుతోంది. ఇటీవ‌ల దేశంలోని అయిదు రాష్ట్రాల‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏ ఒక్క దానిలో ప‌వ‌ర్‌ను బీజేపీ ప‌రివారం చేజిక్కించు కోలేక పోయింది. క‌మ‌ల ద‌ళాలు ఈ దెబ్బ‌కు కోలుకోలేకుండా పోయారు. మూడు చోట్ల కాంగ్రెస్ త‌న జెండాను ఎగుర వేసింది. తెలంగాణ‌లో టీఆర్ ఎస్ .మిజోరంలో మిజోరం నేష‌న‌ల్ ఫ్రంట్ ప్ర‌భుత్వాలు ఏర్పాటు చేశాయి. మ‌ధ్య ప్ర‌దేశ్, రాజ‌స్థాన్, ఛ‌త్తీగ‌ఢ్‌ల‌లో క‌మ‌లం వాడి పోయింది. హ‌స్తం త‌న హ‌వాను కొన‌సాగించింది.మోడీ, అమిత్ షాలు ఈ అయిదు రాష్ట్రాల‌లో విస్తృతంగా ప‌ర్య‌టించారు. ఎన్నో విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు గుప్పించారు.మ‌రెన్నో హామీలు ఇచ్చారు. ప్ర‌జ‌లు వినిపించు కోలేదు. త‌మ ఓటును కాంగ్రెస్ వైపు మ‌ల్లించారు. నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌నను మోడీ స‌మ‌ర్థించుకుంటున్నా దేశ వ్యాప్తంగా అది తీవ్ర ప్ర‌భావాన్ని చూపించింది. ముఖ్యంగా పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి , సామాన్యులు నానా ఇబ్బందుల‌కు లోన‌య్యారు. దీని దెబ్బ‌కు భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ కునారిల్లి పోయింది. వృద్ధి రేటులో ప‌లు మార్పులు చోటు చేసుకున్నాయి. అన్ని వ‌స్తువుల‌పై ప‌న్ను విధానం వ‌ల్ల వ్యాపారులు తీవ్ర అస‌హ‌నానికి గుర‌య్యారు.

అక్ర‌మార్కులు, అవినీతి ప‌రులు, ఆర్థిక నేర‌గాళ్లకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. దేశంలో ప్ర‌భుత్వానికి.ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య వారధిగా ఉన్న రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిమానిట‌రైజేష‌న్ దెబ్బ‌కు జ‌నానికి జ‌వాబు చెప్ప‌లేక చ‌తికిల ప‌డిపోయింది. ఆర్థిక శాఖ మంత్రి జైట్లీ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిన పెట్ట‌లేక పోతున్నారు. ఇటీవ‌లే ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్.మోడీకి కావాల్సిన వ్య‌క్తి ఊర్జిత్ ప‌టేల్ రాజీనామా చేశారు. మ‌రో బోర్డు డైరెక్ట‌ర్ ఇంటి బాట ప‌ట్టారు. ఆర్బీఐలో ఎన్నో నిల్వ‌లు మూలుగుతున్నాయి.మాకు ఇవ్వండి అంటూ మోడీ చేస్తున్న వ‌త్తిళ్ల‌కు గ‌వ‌ర్న‌ర్ స‌సేమిరా అన్నారు. ప్ర‌తి రూపాయికి భ‌ద్ర‌త క‌ల్పించ‌డంతో పాటు ఇదంతా ప్ర‌జ‌ల సొమ్మేన‌ని.దీనిని ప‌రుల ప‌రం చేస్తామ‌నాడికి త‌మ‌కు హ‌క్కు లేదంటూ దిగిపోయారు. దీంతో మోడీకి కోపం వ‌చ్చింది. ఇండియా బ్యాంకుల నుండి కోట్ల రూపాయ‌లు రుణాలు పొంది.తీర్చ‌కుండా విదేశాల్లో జ‌ల్సాలు చేస్తున్న వారిని ఇక్క‌డికి ర‌ప్పించ‌డంలో ఉదాసీన వైఖ‌రిని పీఎం ప్ర‌ద‌ర్శించ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది.

ఇదే విష‌యాన్ని ప్ర‌తిప‌క్షాలు తీవ్రంగా ఆక్షేపించాయి. త‌క్కువ ధ‌ర‌కే ఫ్రాన్స్ కంపెనీకి యుద్ధ విమానాల కాంట్రాక్టును రిల‌య‌న్స్ అంబానీకి ఇప్పించ‌డం వెనుక మోడీ పాత్ర ఉందంటూ ఆధారాల‌తో స‌హా రాహుల్ బ‌య‌ట పెట్టారు. ఇది స‌క్ర‌మ‌మేనంటూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. స‌ర్కార్ అందించిన ప‌త్రాల్లో కొన్ని మిస్ అవ‌డం మ‌రో దుమారానికి తెర లేపింది. పార్ల‌మెంట్‌లో ఈ అంశంపై స‌భ ద‌ద్ద‌రిల్లింది. ఏం జ‌రుగుతుందో తెలియ‌క వంద కోట్ల భార‌తీయులు ఆందోళ‌న‌కు లోన‌వుతున్నారు. మ‌రో వైపు బీజేపీయేత‌ర పార్టీల‌న్నీ ఒకే తాటిపైకి వ‌స్తున్నాయి. దీని బాధ్య‌త‌ను టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు త‌న భుజాల మీద వేసుకున్నారు. కాంగ్రెస్‌తో జ‌త క‌ట్టారు. ములాయం, లాలూ, అఖిలేష్, మ‌మ‌తా, మాయావ‌తి, స్టాలిన్, దేవెగౌడ‌ల‌తో ఇప్ప‌టికే క‌లిపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌డంతో ఎలాగైనా స‌రే ప‌వ‌ర్లోకి రావాల‌ని కాంగ్రెస్, బీజేపీలు పావులు క‌దుపుతున్నాయి. 15 ల‌క్ష‌ల రూపాయ‌లు జ‌న్ ధ‌న్ ఖాతాల్లో ఎందుకు వేయ‌డం లేదంటూ రాహుల్, ఇత‌ర విప‌క్షాలు మోడీని నిల‌దీశాయి.కేంద్ర సామాజిక‌, న్యాయ శాఖ మంత్రి అథ‌వ‌లే దీనిపై స్పందించారు. 15 ల‌క్ష‌లు ఒకేసారి వేయ‌డానికి కుద‌ర‌దు. ఆర్బీఐని నిధులు ఇవ్వ‌మ‌ని అడిగాం. కానీ వారు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. ప్ర‌భుత్వం పూచీ క‌త్తుగా ఉంటుంది.అప్పుగా ఇవ్వ‌మ‌న్నాం. అయినా స్పందించ‌లేదు. ఎవ‌రైతే ఖాతాలు తెరిచారో వారికి మెల మెల్ల‌గా డ‌బ్బులు వ‌స్తాయి. ఇది నిజం. డ‌బ్బులు రావాలంటే సాంకేతిక కార‌ణాలున్నాయి. వాటిని ఒక్కొక్క‌టిగా మార్చేందుకు చూస్తున్నామ‌ని అథ‌వ‌లె చెప్పారు.

ప్రస్తుతం రిజర్వ్ బ్యాంకు వద్ద దాదాపు 9.43 లక్షల కోట్ల రూపాయల మిగులు ఉంది. కనీస నిల్వలు అంత ఉండాల్సిన పనిలేదన్నది బీజేపీ-అనుకూల ఆర్థిక నిపుణుల వ్యాఖ్య. వీటిలో కొంత భాగాన్ని తీసి ప్రాజెక్టులకు, స్కీంలకు, ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగిస్తే బావుంటుంద‌ని వారి ఆలోచ‌న‌. బయటకు పొక్కలేదు గానీ, ఈ విషయమై కేంద్రం ఇప్పటికే రెండు మూడు దఫాలు ఆర్‌బిఐని సంప్రదించినట్లు సమాచారం. ఆ మిగులు నిధులను మళ్లించ గలిగితే మోదీ తాననుకున్నది నెరవేర్చగలుగుతారని ప్రచారం జరుగుతోంది. ఈసారి కేంద్రం బడ్జెట్లో ‘సార్వత్రిక మూల వేతనం’ (యూనివర్సల్‌ బేసిక్‌ ఇన్‌కమ్‌- యూబీఐ)ని ప్రతిపాదించే అవకాశం ఉంది. దీని లక్ష్యం కూడా పౌరుల ఖాతాల్లో కనీస వేతనం జమ కావడమని తెలుస్తోంది. ఇవన్నీ 2019 ఎన్నికల్లో గెలుపు దిశగా మోదీ టీమ్‌ చేస్తున్న కసరత్తుల్లో భాగమని స్పష్టమవుతోంది. అయితే రిజర్వ్‌బ్యాంకు వద్ద ఉన్న మిగులు నిధులను బలవంతంగా లాక్కోడానికి కేంద్రం ప్రయత్నించరాదని మాజీ ఆర్థిక సలహాదారు కౌశిక్‌ బసు తాజాగా హెచ్చరించారు. ‘‘ఏ నిర్ణయమైనా అది ఆర్బీఐ మాత్రమే తీసుకోవాలి. ఒత్తిడి పనికిరాదు. బ్యాంకు స్వతంత్రతను కాపాడాలి. బ్యాంకు మంచి చెడ్డలన్నీ చూశాకే ద్రవ్య వినిమయంపై నిర్ణయం తీసుకుంటుంది’’ అన్నారాయన.

మిగులును మళ్లిస్తే ఆర్బీఐ రేటింగు పడిపోతుందని మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్ హెచ్చ‌రించారు. ఏ నిర్ణ‌య‌మైనా అర్ధ‌రాత్రి కాకుండా అంద‌రితో చ‌ర్చించాక తీసుకుంటే బావుంటుంద‌ని ప్ర‌జ‌ల సూచ‌న‌. ఏది ఏమైనా ఎన్నిక‌ల వేళ పీఎం మోడీజీ ఏ జిమ్మిక్కు చేస్తారో వేచి చూడాల్సిందే. అప్ప‌టి దాకా వేసే డ‌బ్బుల కోసం జ‌నం బ్యాంకుల వ‌ద్ద బారులు తీరే ప్ర‌మాదం పొంచి వుంది.

Comments

comments

Share this post

scroll to top