మ‌న దేశంలో రావ‌ణుడికి ఎక్క‌డెక్క‌డ ఆల‌యాలు ఉన్నాయో తెలుసా..?

రావ‌ణాసురుడి గురించి తెలుసుగా..! అత్యంత శ‌క్తివంత‌మైన రాక్ష‌సుడు. రామాయణంలో అత‌ని పాత్ర ఏమిటో అంద‌రికీ తెలుసు. సీతాదేవిని కాంక్షించి చివ‌ర‌కు రాముడి చేతిలో హ‌త‌మైపోతాడు. రావ‌ణాసురుడి పాత్ర గురించి మాట్లాడితే ఎవ‌రైనా అత‌న్ని దుష్టుడ‌నే అంటారు, కానీ మీకు తెలుసా..? మ‌న దేశంలోని కొన్ని ప్రాంతాల్లోనూ రావ‌ణాసురుడికి ఆల‌యాలు ఉన్నాయ‌ని..! అవును, మీరు విన్న‌ది నిజ‌మే! అదేంటి, అంతటి దుష్ట రాక్ష‌సుడికి ఆల‌యాలు ఉండ‌డ‌మేమిటి, అత‌న్ని పూజించ‌డ‌మేమిటి? అని ఆశ్చ‌ర్యపోతున్నారా! అయినా ఇది నిజ‌మే. అయితే ఆ ఆల‌యాలు ఎక్క‌డ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Ravan-Temple

ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని బిస్ర‌ఖ్ అనే గ్రామంలో రావ‌ణాసురుని ఆల‌యం ఉంది. ఆ ప్రాంతంలో రావ‌ణుడు జ‌న్మించిన‌ట్టు చ‌రిత్ర‌కారులు చెబుతున్నారు. అక్క‌డ 42 అడుగుల ఎత్త‌యిన ఓ శివ‌లింగాన్ని, 5.5 అడుగుల ఎత్త‌యిన రావ‌ణున్ని విగ్ర‌హాన్ని ప్ర‌స్తుతం నిర్మిస్తున్నారు. అక్క‌డికి భ‌క్తులు రోజూ అధిక సంఖ్య‌లో వ‌చ్చి రావ‌ణున్ని ద‌ర్శించుకుని వెళ్తుంటారు.

కాన్పూర్‌లోని శివాలా అనే ప్రాంతంలో ఉన్న శివాల‌యం వ‌ద్ద ద‌శాన‌న్ ఆల‌యం ఉంది. ఆ ఆల‌యంలో నెల‌కొన్న రావ‌ణాసురున్ని భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో దర్శించుకుంటారు. ఏటా ద‌స‌రా ఉత్స‌వాల స‌మ‌యంలో అక్క‌డికి భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో వ‌స్తారు.

రాజ‌స్థాన్‌లోని జోధ్‌పూర్‌లో మౌద్గిల్ బ్రాహ్మ‌ణులు రావ‌ణుని ఆల‌యాన్ని ప్ర‌స్తుతం నిర్మిస్తున్నారు. వారు రావ‌ణుని వంశానికి చెందిన వార‌సుల‌ట‌. ఈ క్రమంలోనే త‌మ వంశ మూల విరాట్ అయిన రావ‌ణునికి గుడి క‌ట్టాల‌ని నిర్ణ‌యించుకుని ఆ దిశ‌గా ఆల‌యాన్ని నిర్మిస్తున్నారు. అందులో రావ‌ణాసురునికి చెందిన అనేక విగ్ర‌హాల‌ను పెట్టాల‌ని వారు నిర్ణ‌యించుకున్నారు.

Ravan-Temple

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రావ‌ణ్‌గ్రామ్ ప్రాంతంలోనూ ఓ రావ‌ణాసురుని ఆల‌యం ఉంది. అక్క‌డి ప్ర‌జ‌ల‌కు రావ‌ణుడంటే రాక్ష‌సుడు కాద‌ట‌. వారు రావ‌ణున్ని ఎంతో విజ్ఞానం తెలిసిన దైవంగా భావించి కొలుస్తారు. ఆ ఆల‌యంలో రావ‌ణుడికి చెందిన 10 అడుగుల విగ్ర‌హానికి వారు పూజ‌లు చేస్తారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కాకినాడలోనూ రావ‌ణుని ఆల‌యం ఉంది. ఆ ఆల‌యంలో అనేక రావ‌ణుని విగ్ర‌హాల‌తోపాటు శివుని విగ్ర‌హం కూడా ఉంది. ఆ ప్రాంతంలో రావ‌ణుడు శివుడి కోసం అనేక ఏళ్లు త‌ప‌స్సు చేసిన‌ట్టుగా చెబుతారు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top