క‌ల‌లో శివ‌లింగం క‌నిపించింద‌ని జాతీయ ర‌హ‌దారిపైనే 20 అడుగుల లోతు త‌వ్వారు. త‌ర్వాత ఏమైందో తెలుసా..?

నిద్రించిన‌ప్పుడు మ‌న‌కు ఎవ‌రికైనా క‌ల‌లు వస్తాయి. క‌ల‌లు ఎవ‌రికి వ‌చ్చినా, ఏ ర‌కం క‌లలు వ‌చ్చినా అవి మ‌న‌కు నిత్య జీవితంలో జ‌రిగే సంఘ‌ట‌న‌ల తాలూకువో లేదంటో క‌ల్పిత‌మైన‌వో వ‌స్తాయి. కానీ అవి జ‌రిగేందుకు అస్స‌లు అవ‌కాశం ఉండ‌దు. అలా జ‌రిగితే యాదృచ్ఛిక‌మే కానీ క‌ల‌లు అస్స‌లు నిజం కావు. మ‌రి దేవుళ్ల‌కు చెందిన క‌ల‌లు వ‌స్తే..? అంటే అవును, అలాంటి క‌లలు నిజ‌మ‌వుతాయ‌ని చాలా మంది న‌మ్ముతారు. అదిగో… ఆ వ్య‌క్తి కూడా అలాగే న‌మ్మాడు. అత‌ను న‌మ్మ‌డ‌మే కాదు, అత‌ని చుట్టూ ఉన్న జ‌నాలు కూడా నమ్మారు. క‌నుక‌నే ఓ ప్ర‌జా ఆస్తికి ధ్వంసం క‌లిగింది. అత‌నికి క‌ల వ‌చ్చింద‌ని గుడ్డిగా న‌మ్మి చుట్టూ ఉన్న జ‌నాలు అత‌ను చెప్పిన‌ట్టుగా చేశారు. ఇంకేముందీ… ఆస్తి న‌ష్టం క‌లిగించినందుకు క‌ట క‌టాల పాల‌య్యారు.

తెలంగాణ రాష్ట్రంలోని జ‌నగాం జిల్లాలో ఉన్న పెంబ‌ర్తి అనే గ్రామంలో ల‌ఖ‌న్ మనోజ్ అనే 30 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న వ్య‌క్తి నివాసం ఉంటున్నాడు. అత‌ను శివారాధ‌కుడు. అయితే అత‌నికి గ‌త 3 సంవ‌త్స‌రాలుగా ఓ క‌ల రోజూ వ‌స్తుంద‌ట‌. క‌ల‌లో శివుడు అత‌నికి క‌నిపించి ఆ గ్రామం మీదుగా పోతున్న హైద‌రాబాద్‌-వ‌రంగ‌ల్ జాతీయ ర‌హ‌దారిపై ఓ ప్ర‌దేశంలో చాలా లోతున భూమిలో పెద్ద శివ‌లింగం ఉంద‌ని అతను క‌ల కంటున్నాడు. శివుడు త‌న‌కు క‌లలో కనిపించి ఆ లింగాన్ని బ‌య‌ట‌కు తీయించి ఆల‌యం క‌ట్టించ‌మ‌న్నాడు అని అత‌ను చుట్టూ ఉన్న గ్రామ‌స్తుల‌కు రోజూ చెప్పేవాడు. అయితే వారు దాన్ని అంత‌గా ప‌ట్టించుకోలేదు.

కాగా ఇటీవ‌లే మనోజ్ స‌ద‌రు జాతీయ ర‌హ‌దారిపై ఓ ప్ర‌దేశం వ‌ద్ద‌కు వెళ్లి పూన‌కం వచ్చిన‌ట్టు ఊగుతూ ప‌డిపోయాడు. అలా ప‌డిపోయే క్ర‌మంలో చెప్పాడు, అక్క‌డే శివ‌లింగం ఉంద‌ని, లోతున‌ భూమిలో అది ఉంద‌ని అన్నాడు. దీంతో అది విన్న గ్రామ‌స్తులు స‌ద‌రు ర‌హ‌దారిపైనే భూమిని త‌వ్వ‌డం మొద‌లు పెట్టారు. అందుకు గ్రామ మున్సిప‌ల్ వైస్ చైర్మ‌న్‌, స‌ర్పంచ్‌, ఇత‌ర గ్రామ‌స్తులు మ‌ద్ద‌తు ప‌లికారు. ఈ క్ర‌మంలోనే వారు ర‌హ‌దారిపై 20 అడుగుల లోతున‌కు త‌వ్వారు. అయిన‌ప్పటికీ వారికి ఎలాంటి శివ‌లింగం క‌నిపించ‌లేదు. అయితే ఈ విష‌యం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంట‌నే వ‌చ్చిన మనోజ్‌తోపాటు ఆ ర‌హ‌దారిని త‌వ్విన గ్రామ‌స్తుల‌ను, స‌హ‌క‌రించిన మున్సిప‌ల్ వైస్ చైర్మ‌న్‌, స‌ర్పంచ్‌ల‌ను అరెస్టు చేశారు. ప్ర‌జా ఆస్తిని న‌ష్టం చేసినందుకు గాను వారిపై కేసు న‌మోదు చేశారు..! అవును మ‌రి, అలా చేస్తే త‌ప్ప‌దు క‌దా…!

Comments

comments

Share this post

scroll to top